Begin typing your search above and press return to search.

పోలింగ్ వేళ ట్రంప్ ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు?

By:  Tupaki Desk   |   4 Nov 2020 9:30 AM GMT
పోలింగ్ వేళ ట్రంప్ ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు?
X
తాజాగా జరుగుతున్న (అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు పోలింగ్ సాగుతోంది) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ పాక్షింగా ముగిసింది. మరికాసేపట్లో మిగిలిన చోట్ల ముగియనుంది. మరోవైపు.. ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. చిన్న రాష్ట్రాల్లో పోలింగ్ ముగియటం.. ఎన్నికల ఫలితాలు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే..కీలకమైన పోలింగ్ వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు వస్తాయి.ట్రంప్ సతీమణి.. ఓటు వేసేందుకు ఒక్కరే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి రావటం తెలిసిందే. ఎర్లీ ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్న ట్రంప్.. ఇంతకు ముందే తన ఓటును వేశారు.

కీలకమైన పోలింగ్ జరుగుతున్న మంగళవారం ట్రంప్.. వైట్ హౌస్ లోనే ఉండిపోయారు. ఆయనకు అనుకూలంగా ఉంటుందని చెప్పే ఫాక్స్ న్యూస్ కు చెందిన కొందరు స్నేహితులతో కలిసి ఆయన ఎన్నికల ప్రక్రియను విశ్లేషించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మిగిలిన మీడియా సంస్థల మాదిరే ఫ్యాక్స్ న్యూస్ సైతం బైడెన్ కంటే ట్రంప్ పది పాయింట్లు వెనుకబడినట్లుగా పేర్కొంది. అయితే.. మీడియా సంస్థలు.. ఇతర సంస్థలు చేపట్టిన సర్వేలకు భిన్నంగా.. తాను చరిత్రను తిరగరాయబోతున్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు.

అన్ని సర్వేలను దాటి విజయం సాదిస్తానని నమ్మకంగా చెబుతున్న ఆయనకు భిన్నంగా బైడెన్ కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు.తన విజయంతో దారుణంగా దెబ్బ తిన్న అమెరికన్ల ఆత్మను పునరుజ్జీవింపజేస్తానని.. తాను ఎన్నికయ్యాక తొలి సంతకం కోవిడ్ కార్యాచరణ మీదే ఉంటుందని చెబుతున్నారు. అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పలితాలు ఇప్పటికిప్పుడు తేలేలా కనిపించటం లేదు. దాదాపు ఐదారు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.