Begin typing your search above and press return to search.

కాపుల ఐక్యత వేళ వంగవీటి రాధ దారెటు? ఏం చేయనున్నారు?

By:  Tupaki Desk   |   26 Dec 2022 5:44 AM GMT
కాపుల ఐక్యత వేళ వంగవీటి రాధ దారెటు? ఏం చేయనున్నారు?
X
2024 ఎన్నికలకు విశాఖ కాపునాడు కీలకం కానుందా? కాపులంతా ఏకమై తమ సామాజిక వర్గం వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టనున్నారా? కాపుల గర్జన వైసీపీ వైఫల్యాలను ఎండగడుతుందా, ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నా  గంటా శ్రీనివాసరావు ఏమి చేస్తారు.. వంగవీటి రాధా రాజకీయ దారెటు… టీడీపీలోనే కొనసాగుతారా? మరేపార్టీ వైపునా వెళ్తారా.. లేక కొత్త పార్టీని పెడతా... ఇప్పుడు రాజకీయాల్లో చర్చంతా ఇదే.

విశాఖలో జరిగే కాపునాడుపైనే రాష్ట్ర రాజకీయ నేతల చూపులు ఉన్నాయి. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో ఆ కులానికి చెందిన నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మరో ముఖ్య విషయం వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు. ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. కానీ పెద్దగా ఎక్కడా యాక్టివ్‌గా తిరగటం లేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కేవలం వంగవీటి రంగా వర్ధంతికి, జయంతికి మాత్రమే బయటకు వస్తున్నారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారో లేదో తెలియదు.

వైసీపీ నాయకుడు కొడాలి నాని-రాధా స్నేహం తెలిసిందే. వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ సమీపంలోని నున్నలో ఆయన విగ్రహాన్ని గతేడాది ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వంగవీటి రాధాకృష్ణ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇందులో పాల్గొన్నారు.

ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం వల్ల అప్పట్లో రాజకీయంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో దేవినేని అవినాశ్‌ టీడీపీ నుంచి గుడివాలో పోటీ చేశారు. కానీ అక్కడ రాధ ప్రచారం చేయలేదు. ఒకటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం హాయంలో రంగాని హత్య చేయటం. దేవినేని అవినాశ్‌ తండ్రి నెహ్రూనే చేయించారనేది ప్రచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ రాధ ప్రచారం చేయలేదనే వినికిడి ఉంది.

వంగవీటి రాధని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సంచలన వార్తలో కొన్ని నెలల క్రితం విన్నాం. ఇందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు స్వయంగా రాధ మీడియాకు తెలిపారు. అప్పట్లో దీనిపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ-టీడీపీ పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడు రాధ ఇంటికి వెళ్లి ఆయన్న పరామర్శ. కూడా చేశారు.

వంగవీటి రాజకీయ భవితవ్యం చూస్తే… ప్రస్తుతానికి ఆయన టీడీపీలో ఉండి ఉండనట్లు కనిపిస్తుంది. రాధకు టీడీపీ అవసరం లేకపోయినా… టీడీపీకి రాధ ఎంతో అవసరం. దీనికి ప్రధాన కారణంగా రంగా పేరు చెబితే, ఆయన సామాజిక వర్గం ఓట్లతోపాటు, అభిమానుల ఓట్లు లక్షల్లో పడుతాయి. అందుకే రాధ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా… చంద్రబాబు చూసిచూడనట్లు ఉన్నారు. గుడివాడలో కాపు సమాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నందున అక్కడ నుంచి ఆయన్న పోటీ చేయించాలని టీడీపీ భావిస్తుందని కొందరు అంటున్నారు. కానీ తన స్నేహితుడి ఆయన పోటీ చేయరని, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని మరికొందరు మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ పుల్‌ స్టాప్‌ పడాలంటే కాపునాడు జరగాలి. అందులో రాధ రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. వెయిట్‌ చేద్దాం మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.