Begin typing your search above and press return to search.
ఆఫ్ఘన్ : ఆ తాలిబన్ల మంత్రులు ఎక్కడ చదువుకున్నారో తెలుసా ?
By: Tupaki Desk | 11 Sep 2021 9:15 AM GMTఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైంది. అమెరికా సైన్యం ఆఫ్ఘానిస్తాన్ ను వదిలేసిన తర్వాత, అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘన్ ను సొంతం చేసుకుంది. తాలిబన్లు కాబుల్‌ను కబ్జా చేసిన తరువాత ప్రపంచం వారి అకృత్యాలపై దృష్టిసారించింది. అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పొరుగుదేశం పాకిస్తాన్ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ ఐ చీఫ్ కాబూల్ లో పర్యటనలు చేస్తుండగా, పంజ్ షీర్ పై పాకిస్తాన్ యుద్ధ విమానాలతో దాడులు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఇప్పుడు తాలిబాన్లకు పాక్ తో ఉన్న కనెక్షన్ గురించి ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో తాలిబాన్ క్యాబినెట్ ఏర్పడింది. ముల్లా మొహమ్మద్ హసన్ ప్రపంచ తీవ్రవాదుల జాబితాలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి అయిన ఈయనను అప్పుడు యూఎన్ భద్రతా మండలి నిషేధించింది. తాలిబన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిరాజుద్దీన్ హక్కానీ తలపై అమెరికా ప్రభుత్వం రూ. 73 కోట్ల రివార్డు ప్రకటించింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం, తాలిబన్ క్యాబినెట్ లో స్థానం సంపాదించిన మంత్రులలో ఐదుగురు పాకిస్థాన్ లోని పెషావర్ లో గల హక్కానియా మదరసాలో చదువుకున్నారు. ఇది పాక్ లో ప్రముఖ మదరసాగా పేరొందింది. సంప్రదాయ సైనిక శిక్షణ విషయంలో పేరొందిన ఈ మదరసా, అఫ్ఘానిస్తాన్ ను సోవియట్ ఆక్రమించుకున్నాక అక్కడి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ మదరసాను పాకిస్తాన్ జిహాదీ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఈ మదరసా పేరు జామియా దారుల్ ఉలూమ్ హక్కానియా అకోడా ఖటక్.
ఇది పాకిస్తాన్ లోని పెషావర్ లో ఉంది. తాలిబన్ క్యాబినెట్ లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ (జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి), మౌలానా అబ్దుల్ బాకీ (ఉన్నత విద్యాశాఖ మంత్రి), నజీబుల్లా హక్కానీ (సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి), మౌలానా నూర్ మొహమ్మద్ సాకిబ్ (హజ్ మంత్రి), అబ్దుల్ హకీం సహ్రాయ్ (న్యాయ మంత్రి) తదితరులు ఈ జిహాదీ యూనివర్శిటీలోనే చదువుకున్నారు.