Begin typing your search above and press return to search.

రెజ్లింగ్​ స్టార్​ సుశీల్​ ఎక్కడ? హత్యకేసుతో సంచలనం..!

By:  Tupaki Desk   |   11 May 2021 12:30 PM GMT
రెజ్లింగ్​ స్టార్​ సుశీల్​ ఎక్కడ? హత్యకేసుతో సంచలనం..!
X
ప్రముఖ రెజ్లింగ్​ స్టార్​, ఒలంపిక్స్​లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్​ సుశీల్​ మిస్సింగ్​ ప్రస్తుతం సంచలనంగా మారింది. యువ రెజ్లర్​ సాగర్​ రాణా కొంతకాలం క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకేసులో సుశీల్​ పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్​ కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే సుశీల్​ పై ఢిల్లీ పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు ఇచ్చారు.

సాగర్​ రాణా హత్య కేసులో సుశీల్​ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎఫ్​ఐఆర్​ లో అతడి పేరును చేర్చారు.

ఛత్రశాల్‌ స్టేడియం పార్కింగ్‌ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఆ టైంలో సుశీల్‌ అక్డే ఉన్నట్టు సమాచారం. కొంతకాలంగా సుశీల్​కు .. రెజ్లర్​ రాణాకు పడటం లేదు. రాణా .. తన గురించి బయట తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సుశీల్​ గతంలో ఆరోపణలు గుప్పించాడు. దీంతో అతడిని ప్లాన్​ ప్రకారమే రప్పించే తన అనుచరులతో కలిసి దాడి చేయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం సుశీల్​ పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.పలు రాష్ట్రాల్లో వెతుకుతున్నారు.

ఈ విషయంపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) స్పందించింది. రెండు ఒలంపిక్​ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్​గా నిలిచిన సుశీల్​ కుమార్​పై హత్య ఆరోపణలు రావడం దురదృష్టకరమని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ అన్నారు. ఈ పరిణామం మొత్తం రెజ్లింగ్​కే చెడ్డ పేరు తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రెజ్లింగ్​ అంటే ఒకప్పుడు రౌడీ ముక అనే పేరు ఉండేదని.. ప్రస్తుతం ఆ పేరును మళ్లీ తీసుకొస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు