Begin typing your search above and press return to search.

అక్కడ జిగేల్...ఏపీలో సచివాలయం ఎక్కడ....?

By:  Tupaki Desk   |   1 May 2023 9:20 AM GMT
అక్కడ జిగేల్...ఏపీలో సచివాలయం ఎక్కడ....?
X
ఉమ్మడి ఏపీ విడిపోయాక తెలంగాణాకు ఏపీకి కలిపి పదేళ్ల పాటు పాత సచివాలయాన్నే విభజన చట్టం మేరకు వాడుకునే వెసులుబాటు ఇచ్చారు. అయితే 2015లో ఓటుకు నోటు కేసు తరువాత చంద్రబాబు ఏపీకి తరలి వచ్చేశారు. ఆనాడు ఆయన ఏపీకి టెంపరరీ అంటూ సచివాలయం నిర్మించారు. అది 2016లో జరిగింది. ఆ సచివాలయంతో పాటు అసెంబ్లీ, శాశనమండలి కూడా ఉంటుంది.

ఇందుకోసం అప్పట్లో ఏకంగా వేయి కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇంత చేసినా నాలుగైదు బ్లాకులతో పరిమితంగా ఉంది ఏపీ సచివాలయం. గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు అక్కడ హడావుడి ఉండేది. జగన్ అమరావతిని రాజధానిగా కాకుండా మూడు రాజధానులు అంటూ కొత్త నినాదం అందుకోవడంతో సచివాలయం ప్రభ మసకబారింది.

అసెంబ్లీ ఉన్నపుడు మంత్రి వర్గ సమావేశాల సందర్భంగా మాత్రమే ఏపీ తాత్కాలిక సచివాలయం పనిచేస్తుంది. ఆ మీదట అక్కడ ఏమీ ఉండదు. జగన్ అయితే గత నాలుగేళ్లుగా తాడేపల్లిలోని తన నివాసంలోని క్యాంప్ ఆఫీసునే సమీక్షలకు కేంద్రంగా మార్చేశారు. అక్కడితే అధికారులు మంత్రులు వస్తారు.

మిగిలిన వారు కూడా సచివాలయానికి పోవడంలేదు. దాంతో సచివాలయం పూర్తిగా కళ తప్పిపోయి ఉంది. ఒక విధంగా రాజధాని లేదు సచివాలయం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అదే తెలంగాణా లో తీసుకుంటే పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా కట్టి జిగెల్మనిపించేల నిర్మించారు. దాని ఖర్చు కూడా దాదాపుగా పన్నెండు వందల కోట్లు.

కానీ ఎన్నో సదుపాయాలతోనో దాన్ని నిర్మించారు. ఆరు అంతస్తులతో కట్టారు. ఈ కొత్త సెక్రేటేరియట్ లో ఏకంగా 635 గదులు ఉన్నాయి. అలాగే నాలుగు వైపుల నుంచి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. పటిష్టమైన అయిదు ఐదు అంచెల భద్రతా వ్యవస్థ ఉంది.

ఇక అత్యాధునికంగా దీన్ని నిర్మించారు. 265 అడుగుల ఎత్తు ఉన్న సచివాలయాన్ని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు.ప్రత్యేక హెలిప్యాడ్‌ కూడా ఉంది. రూఫ్‌ టాప్‌లో స్కై లాంజ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

ఒక్క మాటగా చెప్పుకోవాలీ అంటే దేశంలోనే టాప్ గా తెలంగాణా సచివాలయం ఉంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆరవ అంతస్తులో ఉంటారు. అలాగే ఈ సచివాలయంలో పూర్తిగా వర్చువల్ విధానంలో రివ్యూస్ చేసుకునే ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా నేరుగా సమీక్షించే సదుపాయం దీని సొంతం. అలాంటి అద్భుతాన్ని కేసీయార్ అక్కడ ఆవిష్కరిస్తే ఏపీలో మాత్రం రాజధని ఎక్కడో తెలియదు, సచివాలయం అంతకంటే సందడి లేక కళావిహీనంగా ఉంది.

మరి విభజన జరిగి తొమ్మిదేళ్ళు అవుతునన ఏపీకి ఏమిటీ దుస్థితి అన్నదే అందరి బాధ ఆవేదనగా ఉంది. తెలంగాణా అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోతూంటే ఏపీలో సచివాలయం టెంపరరీ అంటారు. ఆఖరుకు అది కూడా ఎక్కడా కళా కాంతులు లేకుండా చేశారు. మొత్తానికి ఏపీ ఎపుడు ఎత్తిగిల్లుతుంది. రాజధాని ఎక్కడ, సచివాలయం ఎక్కడ అంటే జవాబు ఎవరు చెబుతారు మరి.