Begin typing your search above and press return to search.

షర్మిలకు ట్రోల్స్ తప్పితే పబ్లిసిటీ ఎక్కడా?

By:  Tupaki Desk   |   4 March 2021 11:30 AM GMT
షర్మిలకు ట్రోల్స్ తప్పితే పబ్లిసిటీ ఎక్కడా?
X
ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజన్న రాజ్యం స్థాపిస్తానని వచ్చిందామే. తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యమంటూ ముందుకెళుతోంది. కానీ ఆమె యాస, భాష వేరు.. పుట్టింది వేరు. అందుకే ఆంధ్రుల పాలనపై పోరాడిన తెలంగాణ సమాజం ఈ ఆంధ్రా నేతను అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదట.. అందుకే ఆమె ఇంటి బయటా.. ఆఖరుకు సోషల్ మీడియాలోనూ తెలంగాణ సమాజం నుంచి ఆదరణ దక్కడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరామే..

ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ఆర్ గారాల కూతురు అయిన వైఎస్ షర్మిల అడుగులు తెలంగాణ వైపు పడ్డాయి. జగన్ ను ఏపీలో సీఎంను చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన షర్మిల ఏపీ రాజకీయాల నుంచి తప్పుకొని మరీ అన్న మీద కోపంతోనో లేక ఇంట్లో ఉన్న సమస్యల వల్లనో ఏమో కానీ మెట్టినిల్లు అయిన తెలంగాణ గడప తొక్కింది. ఆంధ్రా ముద్ర పడకుండా ఆదిలోనే తాను తెలంగాణ కోడలును అని పార్టీ ఏర్పాటు చేయబోతోంది.

అయితే ఈ సందర్భంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆంధ్రా నుంచి పెయిడ్ వర్కర్స్ వస్తున్నారని.. నిజమైన నాయకులు ఎవరూ ఆమె వెంట రావడం లేదని.. ఇంతవరకు ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా రాలేదని ఆమెపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణ నాయకుల బలం లేకుండా ఆమె ఇక్కడ ఎలా రాజకీయం చేస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ తెచ్చుకుంది మా పాలన మేము చేసుకోవాలని ఆంధ్రా వాళ్ల పాలన కాదు అని ఇక్కడి రాష్ట్ర ప్రజలు, నెటిజన్లు వాదిస్తున్నారు. ఇక్కడ కావాల్సింది రాజన్న రాజ్యం కాదని.. తెలంగాణ వాళ్లే పరిపాలించాలని కోరుకుంటున్నారు.
టీఆర్ఎస్ కానీ.. బీజేపీ కానీ.. కాంగ్రెస్ కానీ ఎవరైనా పర్లేదు అని.. ఆంధ్రా వాళ్లు వద్దు అనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.

ఆంధ్రా వాళ్లు వద్దనే తెలంగాణ తెచ్చుకుంటే మళ్లీ ఈ లొల్లి ఏంది అని తెలంగాణవాదులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారట..ఇవి విని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారట.. పబ్లిసిటీ లేదు అని అంటున్నారట.. చూడాలి.. షర్మిల సక్సెస్ అవుతుందో లేక వైసీపీ మాదిరిగాగా తెలంగాణలో పార్టీ లేకుండా పోతుందో అని అనుకుంటున్నారు..