Begin typing your search above and press return to search.

కనిపించకుండా పోయిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి ఎక్కడ?

By:  Tupaki Desk   |   23 Nov 2021 1:30 AM GMT
కనిపించకుండా పోయిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి ఎక్కడ?
X
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆట గురించి తెలిసిందే. టెన్నిస్ కోర్టులో దిగిన తర్వాత ఆమె ఎంత ధాటిగా ఆడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆమె.. తనపై చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఆరోపణల అనంతరం నుంచి సదరు క్రీడాకారిణి ఆచూకీ బయట ప్రపంచానికి తెలీటం లేదు. నవంబరు 2న ఆమె ఆరోపణలు చేసిన తర్వాత నుంచి ఆమె మిస్సింగ్ అయిపోయారు. దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికి ఆమె ఎక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచానికి తెలీని పరిస్థితి.

ఆమె మిస్సింగ్ పైన మహిళల టెన్సిస్ సంఘం మొదలు సెరెనా విలియమ్స్ వరకు పలువురు ఆగ్రశ్రేణి క్రీడాకారిణులు గళం విప్పటంతో ఇదో పెద్ద ఇష్యూగా మారింది. దీంతో.. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందించింది. పెంగ్ షువాయి ప్రస్తుతం ఆమె నివాసంలో ఉన్నారని.. త్వరలోనే బయటకు వస్తారని పేర్కొందే తప్పించి..ఇంతకాలం ఎక్కడ ఉందన్న మాటను మాత్రం చెప్పలేదు.

అంతేకాదు.. ఆమె ఇంట్లోనే ఉండి ఉంటే.. చూపించటానికి ఐదు నిమిషాల కంటే తక్కువ పని. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే.. చైనా మాత్రం స్పందించని పరిస్థితి.పెంగ్ఆ మాటకు వస్తే పెంగ్ షువాయి మాత్రమే కాదు.. చైనా ప్రభుత్వం మీదా.. పాలనలో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్న వారి మీద ఎలాంటి విమర్శలు చేసినా.. వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా.. ఆ తర్వాత నుంచి ప్రముఖులు కనిపించకుండా పోవటం ఈ మధ్యన ఎక్కువైంది. వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారు ఏ రంగానికి చెందిన వారైనా.. మిస్సింగ్ మాత్రం అందరి విషయంలో ఒకటేలా ఉంటుందని చెబుతున్నారు.

అందుకు చైనాలో శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన అలీబాబా గ్రూపు సంస్థ అధినేత జాక్ మా కూడా అలాంటి పరిస్థితే. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మైండ్ సెట్ ను విడిచిపెట్టాలన్నారు. ఆ తర్వాత నుంచి జాక్ మాకు కష్టాలు మొదలయ్యాయి. అతగాడి ఆస్తుల విలువ పడిపోవటమేకాదు.. దాదాపు మూడు నెలల పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు.

ఆయన చైనాను విడిచి పెట్టి బయటకు వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. తన ఇంటి నుంచి వీడియో కాల్ లో కనిపించి.. టెన్షన్ తప్పించారు.ఇలాంటి పరిస్థితి చాలామంది ప్రముఖులు.. సెలబ్రిటీలు ఎదుర్కొంటున్నారు. ఇలా మిస్ అయిన వారికి సంబంధించిన వివరాల కోసం.. వారి ఆచూకీ కోసం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగి.. వివిధ దేశాలు.. సంఘాలు.. వేదికలు ప్రశ్నించినప్పటికి మౌనంగా ఉండటం..పట్టనట్లుగా వ్యవహరించటం చైనాకు అలవాటుగా మారింది. గడిచిన కొన్నేళ్లుగా ఇలా మిస్ అయిన పలువురి ఆచూకీ నేటికి లభించని పరిస్థితి.