Begin typing your search above and press return to search.
నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఎక్కడ .. సిట్ పట్టుకోలేదా , పట్టుకోలేకపోయిందా !
By: Tupaki Desk | 16 Dec 2020 6:50 AM GMTనయీం .. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ . అయితే , షాద్ నగర్ శివార్లలోని మిలీనియం టౌన్ షిప్ లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్ కౌంటర్ లో నయీం మరించాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. అలాగే ఎన్‌కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే , వీటి గుట్టు వీడాలంటే .. నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ను పట్టుకోవాల్సిందే. నయీం మరణించిన ఇన్నేళ్లు అయినా శేషన్న ను పట్టుకోలేకపోవడం గమనార్హం. అసలు వ్యక్తిని అంతం చేసిన అధికారులు , అనుచరుడిని పట్టుకోవడం లో ఇంతలా విఫలం కావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా. అసలు అధికారులకి అతడు చిక్కలేదా,పోలీసులు పట్టుకోవట్లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో నయీం దగ్గర ఒక యాక్షన్ టీం ఉండేది. తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ ఉండేవారు. ఈ యాక్షన్ టీమ్ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదట. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ ఉండేదట. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్ కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్ టీమ్ కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది.
కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. యీంకు చెందిన యాక్షన్ టీమ్‌లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్‌స్టర్‌నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది.