Begin typing your search above and press return to search.

పరిటాల పారిపోయినట్టేనా?

By:  Tupaki Desk   |   21 Sep 2020 3:30 AM GMT
పరిటాల పారిపోయినట్టేనా?
X
తొడగొట్టే వారిని పడగొట్టే సామర్థ్యం పరిటాల సొంతం అని ఆ జిల్లాలో ఓ టాక్ ఉంది. పరిటాల కుటుంబం అంటే ధైర్యానికి మారుపేరు.. వాళ్ల నాన్న.. పెద్దనాన్న.. వాళ్ల తాత ప్రజల కోసం నాయకత్వం వహించి ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడారు అంటారు. కానీ పరిటాల శ్రీరామ్ 2018లో నమోదైన ఒక కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ అందుబాటులో లేకుండా పోయాడట..కనీసం క్యాడర్ కు కూడా కనపడకుండా పారిపోయాడని అనంతపురంలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

అనంతపురం అంటే పరిటాల.. పరిటాల అంటే అనంతపురం.. అన్న రేంజ్ లో ఆ జిల్లాలో రాజకీయం నడిపించారు పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో పరిటాల రాజకీయ వారసుడు అయిన పరిటాల శ్రీరామ్ దారుణంగా ఓడిపోయాక ఎక్కడా కనిపించడం లేదు అంట..

అనంతపురం జిల్లాలోనే కాక ఉమ్మడి ఏపీలో కూడా పరిటాల శ్రీరాంకు కమ్మ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉంది. ఓటమి ఎరుగని నేతగా ఉన్న పరిటాల రవిని హత్య చేసిన తరువాత అతడి శ్రీమతి పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేశారు.

అయితే మంత్రి అయిన తరువాత కూడా ఆమె నియోజకవర్గంలో పెద్దగా పట్టించుకోలేదని.. ఆమె కుమారుడు పరిటాల శ్రీరాంకు నెత్తిన కండ్లు ఉంటాయని ఆ నియోజకవర్గంలో కొందరు ఆడిపోసుకుంటున్నారు. ఎవరు పలకరించినా పలకడు అని.. అందుకే తొలిసారి పోటీచేసిన 2019 ఎన్నికల్లో పరిటాల వారసుడిగా వచ్చి ఎన్నికల్లో చతికిల పడి ఘోరంగా ఓడిపోయాడని స్థానికులు చెబుతుంటారు.

సరే ఓడిపోయిన తరువాత కూడా శ్రేణుల్లో భరోసాని నింపుతూ.. పార్టీని పట్టాలెక్కించే పనిచేయకుండా నియోజకవర్గంలో ఉండకుండా వాళ్ల కుటుంబం వెళ్లిపోయారని ఇప్పుడు టీడీపీ శ్రేణులు మథనడపుతున్నారట.. పరిటాల కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న వర్గాన్ని కూడా పలకరించుకుండా హైదరాబాద్ లో ఉంటున్నాడని అక్కడి వారు లోలోపల రగిలిపోతున్నారట..

పరిటాల శ్రీరాం ఎప్పుడైనా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నలుగురు పర్సనల్ బౌన్సర్స్ ని పెట్టుకొని హడావుడి చేసి వెళ్తున్నాడని.. అతడు పనికి వచ్చేవాడు కాదు అని స్థానికుల్లో ఒక వాదన వినిపిస్తోంది. ఇదంతా చూసి పరిటాల శ్రీరాం పారిపోయాడని అనంతపురం జిల్లాలో ఒకటే చర్చ జరుగుతోందట..

ఇటీవల పరిటాల కుటుంబంతో పరిటాల వర్గం కూర్చొని పరిటాల శ్రీరాం వ్యవహారం బాగాలేదని.. ఇలా అయితే మనం వచ్చే ఎన్నికల్లో కూడా అడ్రస్ లేకుండా పోతాం అని.. మళ్లీ నువ్వే ఉండాలని పరిటాల సునీతని కోరారని ఇన్ సైడ్ టాక్. ఇది నిజామా.. కాదా అని పక్కనపెడితే.. పరిటాల శ్రీరాం మాత్రం సొంత నియోజకవర్గంలో లేకుండా పోయిన వైనంపై ఇప్పుడు అక్కడ కథలు కథలుగా చర్చ జరుగుతోంది.