Begin typing your search above and press return to search.

గల్లా జయదేవ్ టీడీపీ నుంచి గయాబ్ యేనా?

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:00 AM GMT
గల్లా జయదేవ్ టీడీపీ నుంచి గయాబ్ యేనా?
X
మొన్నటి వరకు అమరావతి ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు. పోరాడి జైలుకు కూడా వెళ్లిన గల్లాకు తత్త్వం బోధపడిందా? చంద్రబాబు ఫోన్ చేసినా ఉద్యమానికి కలిసిరాకపోవడానికి కారణం ఏంటి? బీజేపీతో సన్నిహిత సంబంధాలకు గల్లా ఎదురుచూస్తున్నాడా? అంటే ఔననే అంటున్నాయి అమరావతి వర్గాలు..

అమరావతిలోని కొంత భాగం గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో తుడుచుపెట్టుకు పోయింది. అయితే ఎంపీగా గల్లా జయదేవ్ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడంతో తక్కువ మెజార్టీతో గట్టెక్కాడు.

పార్లమెంట్ లో ఎక్కువ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ హడావుడి చేసే గల్లా.. అమరావతి ఉద్యమం మీద జైల్ కు వెళ్లివచ్చాడు. అయితే మళ్లీ ఇప్పుడు ఉద్యమం ఊపు అందుకోవడానికి లోకల్ ఎంపీ అవసరం అని చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గల్లాకు ఫోన్ చేస్తే స్విచ్ఛ్ ఆఫ్ లో ఉందని తెలిసిందట.. గల్లాకు అమరావతి మీద పెద్దగా ఆసక్తి లేదు అని.. ఇటీవల గల్లా జయదేవ్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూముల మీద రచ్చ జరిగి కోర్టు వరకు పోయిన తరువాత చంద్రబాబు మీద.. లోకేష్ నాయకత్వం మీద గల్లాకు పెద్దగా నమ్మకం లేకుండా పోయిందని అంటున్నారు. అందుకే గల్లా సైలెంట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

కానీ కొందరు మాత్రం గల్లా బిజినెస్ మ్యాన్ కాబట్టి .. పార్లమెంట్ లో గల్లా అడిగే ప్రశ్నలు నచ్చి మోడీ భుజం తట్టాడు అని.. అందుకే గల్లా బీజేపీకి టర్న్ అయ్యాడని ప్రచారం సాగుతోంది. గల్లా బీజేపీకి టర్న్ అయ్యాడని.. అతడి బిజినెస్ లకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే బీజేపీలోకి వెళ్లాలని గల్లా సహచరులు సూచించారని సమాచారం. అందుకే గల్లా జయదేవ్ త్వరలోనే బీజేపీలోకి జంప్ అని అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.