Begin typing your search above and press return to search.
తోలి రిపబ్లిక్ డే పరేడ్ ఎక్కడ జరిగింది...ఎలా జరిగింది !
By: Tupaki Desk | 26 Jan 2021 11:30 AM GMTజనవరి 26వ తేదీ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి అంటే దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
ఇక 1950 , జనవరి 26 న మొదటి రిపబ్లిక్ డే వేడుకల్ని రాజ్ పథ్ లో కాకుండా ఇర్విన్ స్టేడియంలో అంటే ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిపారు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం సమయంలో కాకుండా మధ్యాహ్న సమయంలో నిర్వహించారు. ఆ సమయంలో మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి భవన్ ను ఆరు గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు బయలుదేరారు. తోలి రిపబ్లిక్ డే పరేడ్ మేజర్ ద్యాన్ చంద్ స్టేడియం నుండి ఎర్రకోట వరకు సాగింది. ఆర్మీ మార్చింగ్ లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. తోలి రిపబ్లిక్ డే వేడుకలకి ప్రత్యేక గెస్ట్ గా ఇండోనేషియా పెసిడెంట్ సుకర్నో కుటుంబం హాజరు అయింది.