Begin typing your search above and press return to search.
యూకె నుండి వచ్చిన ఆ 433 మంది ఎక్కడ ?
By: Tupaki Desk | 1 Jan 2021 5:30 AM GMT2020 .. ఈ 2020 సంవత్సరం అనేది ఓ పీడకల. ఈ ఏడాది మానవ జీవితంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపారు. కరోనా మహమ్మారి విజృంభణ అలాగే కొనసాగుతుంది. దేశంలో ఇంకా ప్రతిరోజూ కూడా 20 వేల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ వైరస్ భయం ఇప్పుడిప్పుడే తగ్గిపోతుంది అనుకుంటే .. కొత్తగా బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ మళ్లీ అందరిని ఆందోళనకి గురిచేస్తుంది.
యూకె లో వచ్చిన స్ట్రెయిన్ వైరస్ మళ్లీ ప్రపంచం మొత్తం చుట్టుకోకుండా అన్ని దేశాలు కూడా పక్కాగా నియమాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే విమాన ప్రయాణాలని నిషేధించాయి. ఇండియా కూడా యూకె విమానాల్ని రద్దు చేసింది. ఇదిలా ఉంటే విమానాల ని రద్దు చేయడం కంటే ముందు లండన్ నుండి వచ్చిన వారిని పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. లండన్ నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రయాణికులు ఆరోగ్యశాఖ కన్నుకప్పి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంగ్లండ్ నుంచి తమిళనాడుకు వచ్చిన 433 మంది ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద 20 మంది రూపుమార్చుకున్న కరోనా బారినపడగా తమిళనాడులో ఒక్కరు మాత్రమే ఉన్నారని అన్నారు. నవంబర్, డిసెంబర్ లో బ్రిటన్ నుంచి 2,080 మంది తమిళనాడుకు చేరుకోగా వీరిలో 487 మంది ఆచూకీ తెలియలేదు. వీరంతా చెన్నై, చెంగల్పట్టు జిల్లాలకు చెందిన వారని తేలడంతో అవిశ్రాంతంగా గాలిస్తుండగా వీరిలో 54 మంది మరలా లండన్‌కు వెళ్లిపోయినట్లు తెలుసుకున్నామని చెప్పారు. ఎలాంటి వైరసైనా కబసుర కషాయం అణచివేస్తుందని ఆయన తెలిపారు. స్పెయిన్ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన యువకునికి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో యువకుడిని ఉంచి కరోనా చికిత్స చేస్తున్నారు. కొత్త, పాత కరోనా నిర్ధారణకు యువకుడి నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరుకు పంపారు.