Begin typing your search above and press return to search.
పాక్ వద్ద ప్రమాదకర అణ్వాయుధాలు
By: Tupaki Desk | 18 Nov 2016 2:15 PM GMTపొరుగు దేశమైన పాకిస్తాన్ తమకు పక్కలో బల్లెం లాగా మారుతున్న ప్రమాదం గురించి భారతదేశం వ్యక్తం చేస్తున్న ఆందోళన నిజమని తేలింది. ఏకంగా ప్రపంచ పెద్దన్న అమెరికా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు 130 నుంచి 140 వార్ హెడ్ లను పాక్ తయారుచేసినట్లు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా శోధించి మరీ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాకుండా తమ దేశం జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎఫ్-16 ఫైటర్ల ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ లను - మిరాజ్ ఫైటర్ల ద్వారా రాడ్ ఎయిర్ లాంచ్ క్రూస్ మిస్సైల్ ను మోసుకెళ్లే సామర్ధ్యాలను జోడించిందని ఆ శాస్త్రవేత్తలు వివరించారు. కరాచీకి పశ్చిమంగా ఉన్న మస్రూర్ ఎయిర్ బేస్ లో ఎఫ్-16 జెట్లకు అణు వార్ హెడ్ లను మోసుకెళ్లే శక్తి సామర్ధ్యాలను పెంపొందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించి 100 కిలోమీటర్ల లోపల గల టార్గెట్లను పాకిస్తాన్ ఛేదించగలదని పేర్కొంటూ పాకిస్తాన్ వినియోగిస్తున్న టెక్నాలజీ మొత్తం చైనాకు చెందినదేనని చేదు నిజం బయటపెట్టారు.
ఈ పరిశోధనకు సారథ్యం వహించిన హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ... తాము పది న్యూక్లియన్ బేస్ లను పరిశీలించగా అందులో ఐదు సైనిక స్థావరాలు - రెండు ఎయిర్ బేస్ లు ఉన్నట్లు తేలిందని వివరించారు. అక్రో(సింధ్) - గుజ్రన్ వాలా(పంజాబ్) - ఖుజ్దర్(బలూచిస్తాన్) - పనో అక్విల్(సింధ్) - సర్గోధాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారుచేస్తుందని, బహవాల్పూర్ లో గల ఆరో బేస్ ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నట్లు వివరించారు. చైనా సహకారంతో చేస్తున్న ఈ ప్రణాళికల్లో భారతదేశానికి తగిన స్థాయిలో అణ్వాయుధాలు సమకూర్చుకోవాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/