Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలానికి అంతం ఎప్పుడు?

By:  Tupaki Desk   |   24 April 2020 4:45 AM GMT
కరోనా కల్లోలానికి అంతం ఎప్పుడు?
X
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా వేల మంది రక్తనమూనాలు తీసి ల్యాబులకు పంపారు. అవి రావడానికి 10 రోజులు పడుతుంది. సో మే తొలివారం వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. వారందరినీ చికిత్స కోసం అడ్మిన్ చేసి డిశ్చార్జ్ చేయాలంటే మే చివరి వారం వరకు పడుతుంది. అంతే ఎంత లేదన్నా మే నెలాఖరు వరకు కరోనా తీవ్రత ఉంటుంది. మేలో కేసుల సంఖ్య పడిపోతేనే లాక్ డౌన్ మినహాయింపు.. లేదంటే జూన్ 1 వరకు లాక్డౌన్ కు అంతం లేదు. దీంతో జూన్ వరకు లాక్ డౌన్ పై ఆశలు పెట్టుకోకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కేంద్రం మినహాయింపులిచ్చినా తెలంగాణ సర్కారు నో అనేసింది. మే 7 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇక ఏపీలో కొత్త కేసులు పెరుగుతున్న దృష్ట్యా మినహాయింపులను పక్కనపెట్టి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో శ్రీకాకుళం, విజయనగరంలో కేసులు లేవు. అక్కడి జిల్లాల్లోకి ఎవరినీ రానీయకపోవడంతో కొత్త కేసులు పెరగడం లేదు. ఇక తూర్పు, పశ్చిమ గోదావరిల్లోకి ఎలా వస్తున్నాయో తెలియకుండానే కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణ జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. రాయలసీమలోనూ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ఏపీలో మే లో ఖచ్చితంగా లాక్ డౌన్ పొడిగించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 1 వరకు కూడా తీవ్రత కొనసాగే అవకాశాలున్నాయి.

తెలంగాణలో హైదరాబాద్, దక్షిణ తెలంగాణకే కరోనా కేసులు పరిమితమయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నాయని మంత్రి ఈటల తెలిపారు. మేలో తగ్గితే జూన్ 1 నుంచి మినహాయింపులు ఇవ్వవచ్చు.

అయితే తొలుత ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన మినహాయింపులే ఇస్తారు. విద్యాసంస్థలు , థియేటర్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు మాత్రం మే నెలలో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. సో మే నెలలో కరోనా కేసులను బట్టే జూన్ నెల వరకు కరోనా లాక్ డౌన్ ఉంటుందా పొడిగిస్తారా అన్నది తేలుతుంది.