Begin typing your search above and press return to search.

యాదాద్రి ఆల‌య ఉద్ఘాట‌న ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   24 May 2021 2:30 AM GMT
యాదాద్రి ఆల‌య ఉద్ఘాట‌న ఎప్పుడంటే?
X
యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో అత్యంత వైభ‌వం ప‌నులు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప‌నులు ఎప్పుడు పూర్త‌వుతాయి? ఆల‌య ఉద్ఘాట‌న ఎప్పుడు? అన్న ప్ర‌శ్న‌లు భ‌క్తుల‌ను వేధిస్తూనే ఉన్నాయి. వాస్త‌వానికి ఈ ఏడాది కానివ్వాల‌ని అనుకున్నారు. మార్చిలో కేసీఆర్ సంద‌ర్శించిన‌ప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఈ మేర‌కు ప‌నులు వేగంగా కొన‌సాగించాల‌ని చెప్పారు. కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే.. ఈ ఏడాది కూడా ఉద్ఘాట‌న లేన‌ట్టేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప‌నుల‌న్నీ మంద‌గించాయి. నిత్యం దాదాపు వెయ్యి మంది కార్మికులు ప‌నిచేయాల్సి ఉండ‌గా.. ఇప్పుడు కేవ‌లం 300 మందితోనే ప‌నులు సాగుతున్న ప‌రిస్థితి. సెకండ్ వేవ్ లో చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప‌నుల‌న్నీ అసంపూర్ణ‌గా మిగిలిపోయాయి. యాదాద్రి గుట్ట‌పై ప్ర‌ధాన ఆల‌యం లోప‌ల‌, ప్రాకార మండ‌పాలు, అందులో సౌక‌ర్యాలు క‌ల్ప‌న, రోడ్లు, ఘాట్ రోడ్డు విస్త‌ర‌ణ‌, క్యూ లైన్లు, పార్కింగ్ ఇలా.. చాలా ప‌నులు ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌నుల‌కు రూ.848 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. మ‌రో రూ.400 కోట్లు అవ‌స‌ర‌మ‌ని అధికారులు ప్ర‌భుత్వానికి లెక్క‌లు పంపించారు. ఈ డ‌బ్బులు కేటాయించి.. మిగిలి ఉన్న ప‌నుల‌న్నీ పూర్తిచేసిన త‌ర్వాత‌నే ఆల‌య ఉద్ఘాట‌న జ‌రిపించాల‌ని సీఎం భావిస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ పూర్తి కావ‌డానికి ఈ ఏడాది మొత్తం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఆ లెక్క‌న చూసుకుంటే.. వ‌చ్చే ఏడాదే ఉద్ఘాట‌న ఉండొచ్చ‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.