Begin typing your search above and press return to search.

బాలయ్య - లోకేష్ తిరుపతిలో తొడగొడుతారా?

By:  Tupaki Desk   |   27 March 2021 3:30 PM GMT
బాలయ్య - లోకేష్ తిరుపతిలో తొడగొడుతారా?
X
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఇక ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ ఎప్పుడో రంగంలోకి దిగింది. బీజేపీ నిన్ననే అభ్యర్థిని ప్రకటించి రంగం సిద్ధం చేస్తోంది.

ఇక బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్ పవన్ ను తీసుకురావాలని నిన్ననే కలిసి వచ్చింది. ఇక టీడీపీ కూడా సార్ల కోసం వేట షురూ చేసిందట.. సినీ హీరో, సీమలో క్రేజ్ ఉన్న లోకేష్ మామ బాలక్రిష్ణతో తిరుపతిలో ప్రచారం చేయించాలని భావిస్తోందట..

లోకేష్, బాలయ్యలను క్షేత్రస్థాయిలో దించి మామ అల్లుళ్లతో తిరుపతి జనాలను ఆకట్టుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే లోకేష్ భాషపటిమకు, బాలయ్య ఆవేశ ఆగ్రహానికి ఈ సారి ఎవరు బలి అవుతారో.? ఎలాంటి జోకులు పేలుతాయోనన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.

అయితే ఎవ్వరు ఏమనుకున్నా ఈసారి చంద్రబాబు, లోకేష్, బాలయ్యలు తిరుపతిలో ప్రచారం చేసి టీడీపీని గెలిపించాలని పట్టుదలగా ఉన్నారట.. వీరు ముగ్గురు ఎంట్రీ ఇస్తే కాక రేపడం ఖాయమని టీడీపీకి అంతో ఇంతో ఓట్లు పడుతాయని భావిస్తున్నారట.. మరి ఏం జరుగుతుందనే వేచిచూడాలి.