Begin typing your search above and press return to search.
రాజధానిగా విశాఖ వేళ... ఆర్‌బీఐ సంచలన నిర్ణయం!
By: Tupaki Desk | 7 Feb 2023 10:21 AM GMTవైసీపీ ప్రభుత్వం దాదాపు ఉగాది నుంచి విశాఖపట్నం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించనుంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానులకు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. జనవరి 23న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
అయినా సరే జగన్ ప్రభుత్వం విశాఖపట్నమే రాజధాని అన్నట్టు దూకుడు పెంచేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను త్వరలో వైజాగ్ షిప్టు అవ్వుతున్నానని.. అక్కడ నుంచే పాలన సాగిస్తానని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కోర్టు విచారణలో కేసు ఉండగా ఆయన రాజధాని అంశంపై వ్యాఖ్యలు ఎలా చేస్తారని మండిపడ్డాయి.
అయితే ఈ విమర్శలను వైసీపీ నేతలు లెక్కచేయడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరలోనే విశాఖ రాజధాని అవుతుందని తేల్చిచెబుతున్నారు. ముఖ్యమంత్రి పాలన అక్కడి నుంచే సాగుతుందని తేల్చిచెబుతున్నారు.
ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్‌బీఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తమ కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచే రిజర్వు బ్యాంక్ కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశాలకు హైదరాబాద్ నుంచే అధికారులు విజయవాడకు రావాల్సి వస్తోంది. దీనివల్ల రాకపోకలతోపాటు పరిపాలన పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ అధికారుల బృందం ఇటీవల విశాఖలో పర్యటించింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించింది. జిల్లా అధికారులతో మంతనాలు జరిపింది. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం కోసం పలు భవనాలను పరిశీలించింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వానికి ఇప్పటికే వివరించినట్టు ఆర్‌బీఐ ప్రతినిధులు తెలిపారు.
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ తలపోస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మధురవాడ, రుషికొండ, ఆరిలోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతువాక, కైలాసగిరి, సాగర్‌నగర్ పరిధిలోని పలు భవనాల్ని ఆర్‌బీఐ అధికారులు పరిశీలించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జునతో చర్చలు జరిపారు.
అయితే ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన స్థలం సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఆర్‌బీఐ అధికారుల బృందానికి తెలిపారు.
అయితే స్థలం కంటే కూడా వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా నిర్మాణం పూర్తయిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. దీంతో భవనాల పరిశీలనలో కొందరు ఉద్యోగులు నిమగ్నమైనట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. తాము అనుకున్న విధంగా భవనం లభిస్తే నెల వ్యవధిలోపే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆర్‌బీఐ అధికారులు తాజాగా ప్రభుత్వానికి తెలపడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.