Begin typing your search above and press return to search.

కరోనాను జయించాక రొమాన్సు ఎప్పుడు మొదలుపెట్టాలి?

By:  Tupaki Desk   |   28 Sep 2020 7:50 AM GMT
కరోనాను జయించాక రొమాన్సు ఎప్పుడు మొదలుపెట్టాలి?
X
అనుకుంటాం కానీ కొన్ని విషయాల్ని పెద్దగా పట్టించుకోం. వాటి గురించి పెద్ద చర్చ కూడా జరగదు. కానీ.. సదరు సమస్యను లక్షలాది మందికి ఎదురవుతుంటుంది. ఇప్పుడు అలాంటి సమస్యే మేం చెప్పేది. ఇవాళ.. రేపటి రోజున కరోనా ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని ఎవరూ చెప్పలేని పరిస్థితి. కరోనా తగ్గిన తర్వాత రోజువారీ జీవితానికి సంబంధించిన ఎవరితోనూ చర్చించలేని అంశం ఒకటి ఉంటుంది. అదే.. రోజువారీ సెక్సు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చన్న దానిపై ఉండే సందేహాలు అన్ని ఇన్ని కావు.

ముక్కు..నోరు.. గాలి.. కళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పే వైద్యులు.. శాస్త్రవేత్తలు ఈ మధ్యనే వీర్య కణాల్లోనూ కరోనా వైరస్ ను గుర్తించినట్లు చెప్పటంతో ఈ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. చైనాలో కరోనాతో కోలుకున్న 38 మంది వీర్యాన్ని సేకరించిన పరీక్షలు జరిపితే.. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. వీరు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా వారి వీర్య కణాల్లో మాత్రం వైరస్ బతికే ఉందని తేలింది.

దీంతో.. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అన్న విషయంపై ఏమీ చెప్పలేకపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కనీసం ఎంతకాలం సెక్సు లైఫ్ కు దూరంగా ఉండాలన్న దానిపై తాజాగా వినిపిస్తున్న కొన్ని వాదనలు చూస్తే.. కనీసం 30 రోజులైతే దూరంగా ఉండాలంటున్నారు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు.. శరీరంలో కరోనా వైరస్ తాలుకూ ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయానికి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే.. రంగంలోకి దిగటం మంచిదన్న మాట వైద్యుల నోట వినిపిస్తోంది.