Begin typing your search above and press return to search.
నిజం?; యువరాజు.. రాజమాత.. సెలవులు
By: Tupaki Desk | 14 April 2015 10:46 AM GMTపెద్ద రాజ్యానికి రాజు అన్న పేరు పుట్టిన నాటి నుంచి వచ్చేస్తే.. ఆ రాజ్యం మీద యువరాజుకు పెద్దగా మోజు ఉండదని కథల్లో వింటుంటాం. కానీ.. కాంగ్రెస్ యువరాజు మాత్రం అందుకు భిన్నం. తన రాజ్యాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని తెగ ఉబలాటపడిపోతుంటారు. కానీ.. అందుకు పడనివ్వని శక్తులు చాలానే ఉన్నాయి. యువరాజుకు అడ్డేముందని సందేహం రావొచ్చు. కానీ.. లోగుట్టు అంతా ఇక్కడే ఉంది. యువరాజు తన చేతుల్లోకి రాజ్యం రావాలని కోరుకోవటంలో పెట్టిన కండీషనే అసలు సమస్య అని చెబుతున్నారు.
తనకు అప్పజెప్పే పక్షంలో తనకు నచ్చినట్లుగా రాజ్యం ఉండాలని.. సామంత రాజులు తాను చెప్పిన వారే ఉండాలని.. అది కూడా యూత్‌ఫుల్‌గా ఉండాలే తప్పించి ముసలి.. ముతక అనేది కనిపించొద్దన్నది రాహుల్‌గారి అభిమతమని చెబుతారు.
యువరాజు కోరిక ఇలా ఉంటే.. జీవితంలో ఆటుపోట్లు చూసిన రాజమాత సోనియమ్మ తీరు వేరుగా ఉంది. రాజ్యంలో వీళ్లు మాత్రమే ఉండాలన్న కండీషన్ పెడితే రాజ్యం అన్నదే అడ్రస్ లేకుండా పోతుందని.. అందుకే కండీషన్లు పెట్టద్దని వేడుకుంటున్నారు. వేడుకున్నా యువరాజు తన పంతం వీడకపోయేసరికి..రాజమాతకు ఆగ్రహం వచ్చింది.
రాజమాత స్థానాన్ని చేజిక్కించుకోవటానికి ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చిందో అమ్మకు తెలిసినంత బాగా ఎవరికి తెలుసు. రాజమాతగా తనకు కిరీటధారణ జరిపేందుకు సహకరించిన శక్తులన్నింటినీ.. ఇప్పుడు యువరాజు వద్దంటే వద్దని చెప్పటమే ఇప్పుడు ఆసలు సమస్యగా చెబుతున్నారు. అందుకే.. తన మాట వినని రాజ్యం తనకు ఎందుకంటూ తన దారిన తాను పోయారన్నది యువరాజు సెలవుకు సంబంధించి ఒక టాక్.
దాదాపు నెలన్నర రోజుల నుంచి సెలవులో ఉన్న యువరాజు.. మరికొద్ది రోజులు తన సెలవుల్ని పొడగించుకున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 19న కాంగ్రెస్ నేతృత్వంలో జరిగే భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళనకు యువరాజు వస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. యువరాజు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదని.. ఆయన రాకకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. యువరాజు పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని రాజమాత ఒప్పుకునే వరకూ సెలవుల్లోనే ఉంటారా.. ఏమిటి..?