Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీన్లోకి వస్తే ఇలానే ఉంటుంది మరి..

By:  Tupaki Desk   |   25 Jan 2021 11:30 PM GMT
కేసీఆర్ సీన్లోకి వస్తే ఇలానే ఉంటుంది మరి..
X
పని చేస్తారా.. చేయరా? ఆఫీసుకు వస్తారా? రారా? లాంటి ప్రశ్నలు లేని ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి అన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని అందరికి అర్థమయ్యే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేళ్ల పదవీ కాలంలో ఏడుసార్లు కూడా సెక్రటేరియట్ కు వెళ్లని ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పాలి. ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో? మరెప్పుడు ఫాంహౌస్ లో ఉండాలో కూడా తెలీని ఆయన.. ఇటీవల కాలంలో మహా స్పీడ్ గా పని చేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. పెండింగ్ అంశాల్ని తీర్చేస్తున్న ఆయన.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఆదివారం వ్యవసాయ.. మార్కెటింగ్ శాఖతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహిచిన ఆయన.. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ.. అదేనండి పీఆర్సీ.. ప్రమోషన్లతో సహా మిగిలిన అన్ని అంశాలపైనా.. సమస్యలపైనా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. ముఖ్య కారర్యదర్శులు రామక్రిష్ణారావు.. రజత్ కుమార్ ల ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వారం.. పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఉద్యోగ సంఘాల వారితో చర్చలు జరిపి.. తనకు సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలని కోరారు. ప్రమోషన్ల ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలని.. వీలైనంత ఎక్కువ మందికి ప్రమోషన్లు కల్పించలన్న సీఎం కేసీఆర్.. వడి వడిగా నిర్ణయాలు తీసుకోవలని.. వేగంగా పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించటం చూస్తే.. మాంచి వర్కు మూడ్ లో కేసీఆర్ సారున్నారన్న వ్యాఖ్యలు పలువురు టీఆర్ఎస్ నేతల నోటి వెంట వినిపిస్తోంది.

మరోవైపుతన కొడుక్కి రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నందున.. దానికి ముందే పెండింగ్ ఇష్యూల్ని ఒక కొలిక్కి తీసుకురావాలన్నదే కేసీఆర్ తపనగా చెబుతున్నారు. ఈ కారణంతోనే వడి వడిగా నిర్ణయాలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం ఏమైనా కావొచ్చు.. పాలనా రథం పరుగులు పెట్టటానికి మించి ఎవరూ ఏమీ కోరుకోరు కదా?