Begin typing your search above and press return to search.
'ప్లాస్మా థెరపీ 'కి ఐసీఎంఆర్ అనుమతులెప్పుడు?..వైద్య రంగం ఎదురుచూపులు
By: Tupaki Desk | 28 Aug 2020 3:30 AM GMTకరోనా బారిన పడ్డవారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు అమెరికా ఎఫ్డీఏ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో భారత్ లో కూడా ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభానికి తొందర్లో అనుమతులు వస్తాయని వైద్య రంగం ఎదురుచూస్తోంది. ఐసీఎంఆర్ ఇందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. దేశంలో ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స ఇస్తున్నారు. తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతితో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ద్వారా కొందరు రోగులకు చికిత్సలు నిర్వహించారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించారు.
కాగా గాంధీ ఆస్పత్రిలో పలు పాజిటివ్ కేసులకు వైద్యులు ప్లాస్మా థెరపీ నిర్వహించగా మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ దేశంలోని అన్ని ఆస్పత్రులలో ఇప్పటి వరకు జరిగిన ప్లాస్మా థెరపీల్లో ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకుని ఆ తర్వాత ప్లాస్మా థెరపీ చికిత్స కొనసాగించాలా.. లేక పూర్తిగా అన్ని ఆస్పత్రులకు అనుమతి ఇవ్వాలా అనే విషయమై నిర్ణయం తీసుకోనుంది. మరి ఐసీఎంఆర్ ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తే కరోనాకు అడ్డుకట్ట పడుతుందా అనే విషయమై వైద్య నిపుణులు ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లాస్మా థెరపీ ఏంటంటే.. కరోనా బారిన పడ్డవారు చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత సుమారు 20 రోజులకు రక్తంలోని సీరమ్ లో యాంటీ బాడీలు ఉత్పత్తి అవడం మొదలవుతుంది. ఈ యాంటీ బాడీలను సేకరించి కరోనా బారిన పడ్డవారికి ఆపరేషన్ ద్వారా అందజేయడమే ప్లాస్మా థెరపీ. అయితే ప్లాస్మా థెరపీ కరోనా వచ్చిన అందరికీ చేయలేమని వైద్యులు చెబుతున్నారు.
కరోనా సీరియస్ కేసులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్ద ప్రయోజనం లేదని.. సాధారణ కేసులు, ఓ మోస్తరు కేసులకు మాత్రమే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి వేగంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. మరి కొందరికి ఆలస్యంగా ఉత్పత్తి అవుతాయి. యాంటీ బాడీలు తయారయ్యాయో లేదో తెలుసు కోకుండా సేకరించిన ప్లాస్మాతో చికిత్స చేసినా ఫలితం ఉండదు. అమెరికా ప్లాస్మా థెరపీకి అనుమతులు ఇవ్వడంతో మన దేశం కూడా తొందర్లో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.