Begin typing your search above and press return to search.
రామాయణం విన్నాను , బాలీవుడ్ సినిమాలు చూశా : ఒబామా !
By: Tupaki Desk | 17 Nov 2020 11:10 AM GMTఅగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పుస్తకం రాసిన సంగతి అందరికి తెలిసిందే. ఒబామా రాసిన పుస్తకం పేరు ఏ ప్రామిస్డ్ ల్యాండ్. ఈ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే, ఆ బుక్ తొలి సంపుటి ఈ మధ్య రిలీజైంది. అందులో ఇండియా గురించి ఆయన కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు తెలిపారు. ఇండోనేషియాలో తన చిన్నతనం గడిచిందని, ఆ సమయంలో హిందూ కావ్యాలు అయిన రామయణం, మహాభారతం లో ఉన్న కథలను విన్నట్లు ఒబామా తెలిపారు. భారత్ అతిపెద్ద దేశమని, ఆరోవంతు ప్రపంచ జనాభా అక్కడే ఉన్నదని, ఆ దేశంలో సుమారు రెండు వేల స్థానిక తెగలు ఉన్నాయని, అక్కడ సుమారు 700 వందలకుపైగా భాషలు మాట్లాడుతుంటారని ఒబామా తన పుస్తకంలో పొందుపరిచారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేంత వరకు ఒబామా భారత్ కి రాలేదు. 2010లో ఒబామా భారత్ పర్యటనకి వచ్చారు. కానీ తన ఊహాల్లో మాత్రం ఇండియాకు ప్రత్యేక స్థానం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలో తన బాల్యం గడిచిందని, ఆ సమయంలో రామయణ, మహాభారత కథలు విన్నానని, తూర్పు దేశాల మతాలపై ఆసక్తి వల్ల అలా జరిగి ఉంటుందని, పాక్-ఇండియాకు చెందిన మిత్రులు తనకు పప్పు, కీమా వండడం నేర్పించారని, బాలీవుడ్ సినిమాలకు కూడా అలవాటు అయ్యేలా చేశారని ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు. ఇకపోతే , ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకాన్ని రెండు భాగాల్లో ఒబామా రిలీజ్చేయబోతున్నారు. తొలి పుస్తకంలో 2008 ఎన్నికల ప్రచారం నుంచి తొలి టర్మ్ పూర్తి అయ్యే వరకు జరిగిన కొన్ని ఆసక్తి అంశాలను ఆ పుస్తకంలో పొందుపరచనున్నారు.