Begin typing your search above and press return to search.
మాస్కులతో లాభం సరే.. నష్టాలున్నాయా?
By: Tupaki Desk | 6 March 2020 4:10 AM GMTకరోనా భయం ఎంతంటే.. బజార్లోకి అడుగు పెట్టినంతనే చాలామంది ముఖానికి కనిపించే మాస్కుల లెక్కను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కరోనా కారణంగా.. ఆఫీసులకు.. పాఠశాలలకు మాస్కులతో రావాలంటూ ప్రత్యేక సూచనలు జారీ అవుతున్నాయి. మాస్కుల వాడకం పై ఇంతలా హడావుడి సాగుతుంది సరే. నిజానికి మాస్కుల్ని వినియోగించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే విస్మయానికి గురి కాక తప్పదు. మాస్కుల వినియోగం పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ.. అదేనండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. వీటిని చూస్తే.. మాస్కుల వినియోగం వేలం వెర్రి తప్పించి.. నిజంగా దీంతో కలిగే ప్రమోజనం పెద్దగా ఉండదు సరికదా.. సరిగా వాడని పక్షంలో కొత్త కష్టాలు ఖాయమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
కేవలం మాస్కులు వాడితే కరోనా వైరస్ ను అడ్డుకోవటం కష్టమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎందుకంటే.. కరోనా వైరస్ గాల్లో ప్రయాణించలేదు. మహా అయితే.. రెండు నుంచి మీటర్ల మధ్యలోనే అది గాల్లో నుంచి కిందపడిపోతుంది. కాకపోతే.. కింద పడిన కరోనా వైరస్ కొన్ని గంటల పాటు అలానే ఉండిపోతుంది. దాన్ని తాకినా.. దాని దరికి చేరినా వెంటనే చేరుతుంది. అలా చేరటానికి చేతులే కీలకంగా వ్యవహరిస్తాయి.
మనల్ని మనం జాగ్రత్త గా గమనించినా.. వేరే వారిని నిశితంగా పరిశీలించినా ప్రతి ఒక్కరి చేయి.. అదే పనిగా ముఖం మీదకు వెళుతుంది. అంటే.. మాస్కు ముఖానికి ఉన్నప్పటికీ చేతి వేళ్లు అదే పనిగా దాన్ని సరి చేసినా.. మాస్కు లోపలకు చేతి వేళ్లు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చి పోకూడదు. ఇంకా చెప్పాలంటే.. మాస్కు లోపల వైపు చేతి వేళ్లు వెళ్లి.. చేతికి ఉన్న వైరస్ మాస్క్ కు అంటుకొని.. అవి అక్కడే డిపాజిట్ అయితే.. దాని కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇలాంటివెన్నో ఇష్యూలు మాస్కులు వాడితే వస్తాయన్నది మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మాస్కుల వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది. వాటిని చూస్తే.. మాస్కుల వినియోగంలోనూ డేంజర్ పొంచి ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ సంస్థ చేసిన సిఫార్సుల్ని చూస్తే..
% మాస్క్ లు ముక్కు.. నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్క్ లు పెట్టుకోవటం మంచిది.
% నోరు.. ముక్కు.. దవడ ముందు భాగాన్ని పూర్తిగా కప్పేసేలా మాస్క్ లు పెట్టుకోవాలి.
% మాస్క్ కారణంగా ముఖానికి ఎక్కడా ఖాళీ ఉండకూడదు.
% మాస్క్ పెట్టుకున్న తర్వాత పదే పదే ముఖాన్ని తాకకూడదు.
% అలా తాకుతుంటే వైరస్ ముప్పు పెరుగుతుంది.
% మాస్క్ ను ధరించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వెనుక నుంచి తీసివేయాలి.
% మాస్క్ ముందు భాగాన్ని ఎప్పుడు ముట్టుకోకూడదు
% అలా చేస్తే మాస్క్ ముందు భాగంలో అంటుకున్న వైరస్ చేతికి అంటుతాయి. ఇది మరింత ప్రమాదం
% మాస్క్ ను వెనుక నుంచి తీసి జాగ్రత్తగా చెత్త బుట్టలో పడేయాలి.
% మాస్క్ చేతితో తీసి వేసిన తర్వాత చేతుల్ని జాగ్రత్తగా సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి
% ఒకసారి వాడి పడేసిన మాస్క్ ను తిరిగి వాడకూడదు
% ఎప్పటికప్ప్ుడు కొత్త మాస్కులను మాత్రమే వాడాలి.
% మాస్క్ లు పెట్టుకునే ముందు.. వాడి పారేసిన తర్వాత సబ్బు లేదంటే శానిటైజర్ తో శుభ్రం తప్పనిసరి.