Begin typing your search above and press return to search.
అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డుకట్ట పడేదెన్నడూ?
By: Tupaki Desk | 28 Jan 2023 4:43 PM GMTఅమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ అగ్రరాజ్యానికి పెద్ద సమస్యగా మారుతోంది. సూపర్ మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీగా అమెరికన్లు తుపాకులు కొంటున్నారు. గత 50ఏళ్ల కాలంలో తుపాకులు 15 లక్షల మంది ప్రాణాలను తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో హత్యలు.. ఆత్మహత్యలు ఉన్నాయి.
దీపావళి రోజు బాంబులు పేల్చినట్లు అమెరికాలో చిన్నారులు తుపాకులతో సాటి వాళ్లను కాల్చివేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరుచూ వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో నిత్యం ఏదో ఒక తుపాకీ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల మూడు వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కాలిఫోర్నియాలో వరుస ఘటనల్లో ఏడుగురు మరణించగా ముగ్గురు గాయపడ్డారు.
మౌంటైన్ మష్రూమ్ సోయిల్ ఫామ్ లో జరిగిన కాల్పుల్లో షూటర్ ను స్పాట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మెయిన్స్ లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. ఇలాంటి ఘటనలు అమెరికాలో చాలా కామన్ గా మారడం శోచనీయంగా మారింది. అమెరికాలో 18ఏళ్లు నిండినా ఎవరైనా సరే యథేశ్చగా తుపాకులు కోనచ్చు. జేబులో పెట్టుకొని తిరగొచ్చు.. ఎవరు వారిని ప్రశ్నించారు.
తుపాకుల అమ్మకం అమెరికాలో లాభసాటిగా మారింది. 2020 ఒక్క ఏడాదిలోనే 26 లక్షల తుపాకులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రతి ఒక్కరికి తుపాకులు అందుబాటులోకి రావడంతో అమెరికాలో గన్ కల్చర్ పెరిగింది. కొంతమంది మానసిక రోగులు.. కోపోద్రిక్తులు తమ చేతుల్లోని తుపాకులతో ఇతరులపై కాల్పులకు తెగబడుతున్నారు.
ఈ మధ్య 18 ఏళ్ల కుర్రాడు తన 18వ పుట్టిన రోజును జరుపుకున్న మర్నాడే తుపాకుల దుకాణానికి వెళ్లి గన్ కొన్నాడు. ఫేస్ బుక్ లో దానిని పోస్ట్ చేసిన స్కూల్ కు వెళ్లి కాలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయినా దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఓ కుర్రాడు తుపాకీతో తన నానమ్మకు కాల్చి చంపి ఆ తర్వాత స్కూల్ కు వెళ్లి పదేళ్ల వయసున్న పిల్లలపై విచక్షణా రహితంగా కాల్పులు జరుగగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు.
ఇలాంటి ఘటనలు చెప్పుకుంటే పోతే అమెరికాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాను ఆయుధ వ్యాపారులే శాసిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేక పోతున్నాయి. గతంలో ప్రెసిడెంట్ గా ఉన్న బరాక్ ఒబామా తుపాకులపై ఆంక్షలు విధించినా కట్టడి చేయలేకపోయారు. రెండు పర్యాయాలు ప్రెసెడెంట్ అయినా ఈ విషయంలో ఆయన సాధించేది ఏమీ లేదు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం రిపబ్లిక్ పార్టీ వ్యక్తే కావడంతో ఆయన సైతం గన్ వ్యాపారులకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన కూడా అమెరికాలో పెరుగుతున్న తుపాకుల కల్చర్ ను ఏమి చేయలేక పోతున్నారు. కాగా ఇది ఇలానే కొనసాగితే మాత్రం అగ్రరాజ్యం పేరు కాస్తా తుపాకీ రాజ్యంగా మారడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.