Begin typing your search above and press return to search.

వీడియో కాల్ లో ఆంటీ... కుర్రాడికి పులుసు కారిపోయింది!

By:  Tupaki Desk   |   1 Jun 2023 6:19 PM GMT
వీడియో కాల్ లో ఆంటీ... కుర్రాడికి పులుసు కారిపోయింది!
X
దేశంలో రోజు రోజుకీ సైబర్ నేరాలు, బ్లాక్ మెయిల్ దోపిడీలూ పెరిగిపోతున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొంతమంది దుర్మార్గులు... కొంతమంది బలహీనతలకు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో మూల జరిగినట్లు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది యువకుల కక్కుర్తి ఆలోచనలు మారడం లేదు. ఫలితంగా... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... ముంబయికి చెందిన 39 ఏళ్ల వ్యక్తికి మార్చి 17న అకస్మాత్తుగా ఒక అన్ నోన్ నెంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. దీంతో కాల్ రిసీవ్ చేసుకున్న ఆ వ్యక్తి.. ఆ వీడియో కాల్ లో ఉన్నది తెలియని మహిళ అయినప్పటికీ కక్కుర్తి పడి చాలాసేపు మాట్లాడాడు! దీంతో ఇతగాడి బలహీనత అర్ధమయ్యిందో ఏమో కానీ... మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా తన బట్టలు మొత్తం తీసివేయడం ప్రారంభించింది ఆ వీడియో కాల్ ఆంటీ.

అయినప్పటికీ మనోడు కాల్ కట్ చేయలేదు. దీంతో... "నీకు నేను పడక సుఖం ఇస్తాను.. మనం అక్రమ సంబంధం పెట్టుకుందాం" అంటూ ఆంటీ రెచ్చగొట్టింది. దీంతో ఇంతకుమించిన బంపర్ ఆఫర్ ఉండదని భావించాడో ఏమో కానీ... ఆ కాన్వర్జేషన్ కంటిన్యూ చేశాడు. ఇక ఇతగాడి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకుందో ఏమో కానీ... ఒకానొక సమయంలో కిలాడీ ఆంటీ పూర్తిగా నగ్నంగా నిలబడిపోయింది. దీంతో ఒక క్షణం తడబడినప్పటికీ.. కంటిన్యూ చేస్తున్న సమయంలో సడన్ గా కాల్ కట్ అయ్యింది. అప్పుడు మొదలైంది అసలు స్టోరీ!!

కాల్ కట్ అయిన కొంతసేపటికి ఆ వ్యక్తికి మరో తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అలవాటులో పొరపాటో, ఆత్రంలో తడబాటో తెలియదు కానీ... వెంటనే ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాడు ఈ వ్యక్తి. దీంతో... కాస్త గంభీరంగా మొదలైన అవతలి వ్యక్తి వాయిస్... "నగ్నంగా ఉన్న మహిళతో నువ్వు మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.

నువ్వు ఎవడివిరా..? నీ అంతు చూస్తా!" అని వార్నింగ్ ఇచ్చి పెట్టేశాడు. అక్కడికే ఇతగాడికి పులుసు ఆల్ మోస్ట్ కారిపోయీన నేపథ్యంలో... మరుసటి రోజు మరో గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్‌ ని తీసిన తరువాత అవతలి వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పరిచయం చేసుకున్నాడు.

"నువ్వు ఓ యువతితో నగ్నంగా మాట్లాడుతున్న వీడియో నా వద్ద ఉంది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేయబోతున్నాను.. అలా చేయకుండా ఉండాలంటే రూ.50 వేల రూపాయలు పంపించు" అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో తన నగ్న వీడియో కాల్ బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన ఆ వ్యక్తి వెంటనే డబ్బులు ఇస్తానని అంగీకరించి, పంపించాడు. ఇలా మార్చి 18వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు పలు దఫాలుగా సుమారు ఆరున్నర లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు.

అయినప్పటికీ సంతృప్తి చెందని ఆ బ్యాచ్ పదేపదే ఆ వ్యక్తిన్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయాడో.. లేక, అప్పటికి తత్వం బోదపడిందో కానీ… ముంబయి పరిధిలోని పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది మ్యాటర్! దీంతో... ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు!