Begin typing your search above and press return to search.
వాట్సాప్ ఇక వదిలించుకోవాల్సిందేనా? కొత్త పాలసీలో ఉన్న చిక్కులేమిటి?
By: Tupaki Desk | 10 Jan 2021 12:30 AM GMTవాట్సాప్ మన జీవితంలో భాగమైంది అనేకంటే.. వాట్సాప్‌కు మనం బానిసలం అయ్యామంటే బాగుంటుందేమో. ఈ అప్లికేషన్ మన జీవితంలో అంత మమేకం అయ్యింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా వాట్సాప్ అనుక్షణం మనలను అంటిపెట్టుకొనే ఉంటుంది. వాట్సాప్ చూడనిదే మనకు డే స్టార్ట్ కాదు. అదేవిధంగా మనం పడుకోబోయే ముందు చివరిసారిగా చూసేది కూడా వాట్సాప్ అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ అప్లికేషన్‌ను చాలా ఏళ్ల క్రితమే ఫేస్బుక్ కొనుగోలు చేసిందన్న విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన కొన్ని కొత్త నిబంధనలను ఇప్పుడు యూజర్లకు చిక్కులు తెస్తున్నాయి.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వాట్సాప్ కొన్ని ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నది. ఆ నిబంధనలకు మనం ఓకే చెబితేనే వాట్సాప్ ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. లేదంటే మనం అకౌంట్‌ను డిలిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ కొత్త నిబంధనలో ఏముందంటే.. ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌లో వచ్చే సమాచారాన్ని ఫేస్బుక్ కూడా ఉపయోగించుకుంటుంది. ఇందుకు మనం అంగీకరిస్తేనే వాట్సాప్ మన మొబైల్లో ఉంటుంది. లేదంటే వాట్సాప్ డిలిట్ అయిపోతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది యూజర్లు ఈ కొత్త నిబంధననను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా చేస్తే తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫేస్బుక్ ఇతర మూడోపార్టీ సర్వీస్ ప్రొవైడర్లు, సాంకేతిక సదుపాయాలు, డెలివరీ తదితర సిస్టమ్స్, సర్వీసులకు మార్కెటింగ్, సర్వేల నిర్వహణ, పరిశోధన, పరిరక్షణ, భద్రత, యూజర్ల ఇంటెగ్రిటీ, కస్టమర్లకు సహకరించే విధానాన్ని ఫేస్బుక్ షేర్ చేసుకుంటుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. తాము టెలిగ్రామ్, లేదా సిగ్నల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ అంశం ట్రెండింగ్‌లో ఉంది.