Begin typing your search above and press return to search.

వాట్సాప్ వినియోదారులు @ 200 కోట్లు !

By:  Tupaki Desk   |   13 Feb 2020 8:30 PM GMT
వాట్సాప్ వినియోదారులు @ 200 కోట్లు !
X
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ గురించి ప్రస్తుతం తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా వాట్సాప్ మన జీవితాలలో కలిసి పోయింది. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే క్షణం ముందు వరకు అందరూ వాట్సాప్ లోనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే , రోజులో ఎక్కువ శాతం వాట్సాప్ చూడటానికే ఉపయోగిస్తున్నారు. అలాగే వాట్సాప్ ని ఉపయోగించేవారు రోజురోజుకి భారీగా పెరుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం .. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగడమే. అలాగే వాట్సాప్ సంస్థ కూడా రోజుకో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులకు మరింతగా ఆకట్టుకుంటుంది.

అయితే , తాజాగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 770 కోట్ల జనాభా ఉండగా ..వారిలో 200 కోట్ల మంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. ఆ 200 కోట్లలో 40 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని వాట్సాప్ బుధవారం స్వయంగా తెలిపింది. అలాగే తమ వినియోగదారుల గోప్యతకి కట్టుబడి ఉంటామని , ఎటువంటి మెసేజ్ , కాల్స్ హిస్టరీస్ ని ఇతరులు ఎవరూ చూడకుండా మరింతగా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేస్తామని తెలిపింది.