Begin typing your search above and press return to search.
యూరోపియన్లు, ఇండియన్లను వేరువేరుగా చూస్తున్న వాట్సాప్..!
By: Tupaki Desk | 26 Jan 2021 8:30 AM GMTవాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై ఇటీవల తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రైవసీ పాలసీపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్‌లకు మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు పలు కీలక విషయాలను నివేదించింది. వాట్సాప్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. యూరోపియన్ యూజర్లు, ఇండియన్ యూజర్లను వేరువేరుగా చూస్తున్నదని పేర్కొన్నది.
అయితే కొత్త పాలసీపై ఇప్పటికే వాట్సాప్‌కు లేఖ పంపినట్టు కేంద్రం పేర్కొన్నది.
భారతీయుల వ్యక్తిగత భద్రత విషయంలో రాజీ పడబోమని తెలిపింది. ఈ మేరకు అడిషినల్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు నివేదించారు. వాట్సాప్ గోప్యత విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని కేంద్రం ఆరోపిస్తున్నది. అయితే యూరోపియన్‌లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం. అందుకే అక్కడ వాట్సాప్ నిబంధనలు కచ్చితంగా అంగీకరించాలన్న నిబంధన లేదు. కానీ భారత్‌లో మాత్రం ఈ నిబంధన లేకపోవడంతో వాట్సాప్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది.
అయితే ఈ విషయంపై ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరఫున హాజరైతన కపిల్ సిబల్ కోర్టుకు తేలిపారు. దీంతో ఈ కేసుపై విచారణను ఢిల్లీ హై కోర్టు మార్చి 15కు వాయిదా వేసింది. మరోవైపు వాట్సాప్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే సోషల్‌మీడియాలో పలువురు వాట్సాప్ ప్రైవసీ విధానాలను తప్పుపడుతున్నారు.