చేతిలో మొబైల్ ఉందంటే.. వాట్సాప్ ఆన్ లో ఉన్నట్టే.. తినకుండా ఉండగలుగుతున్నారు కానీ వాట్సాప్ లో అప్ డేట్ చూసుకోకుండా గంట కూడా ఉండని పరిస్థితి. వినియోగదారులకు వ్యసనంగా మారిపోయిన వాట్సాప్ వారి అభిరుచికి అనుగుణంగా చాలా మార్పులు తీసుకొస్తోంది. కాలం మారుతున్న కొద్దీ విభిన్నమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.
వాట్సాప్ మొదట్లో కేవలం టెక్స్ట్ మెసేజ్ లకు మాత్రమే పరిమితమై ఉండేది.. ఆ తరువాత ఫొటోస్ - వీడియోస్ మారింది. మరికొన్ని రోజుల తరువాత వాట్సాప్ కాలింగ్ - వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా వాట్సాప్ వీడియో గ్రూప్ కాలింగ్ తో అలరించనుంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లోని యాప్ ను అప్ డేట్ చేసుకుంటే ఈ సౌకర్యం వస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఒకేసారి గ్రూపులోని నలుగురు వ్యక్తులు వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి సాధారణ వ్యక్తులకే కాకుండా కొన్ని కార్యాలయాల్లో కూడా ఇది గ్రూపు డిస్కషన్ కు ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది. ఫోన్ కాల్ కు ఉన్న మాదిరిగానే ఒకరికి వీడియో కాల్ చేసిన తరువాత వారిని హోల్డ్ లో పెట్టి మరొకరితో మాట్లాడవచ్చు. అలా నలుగురికి కాల్ చేసి ఆ తరువాత మెర్జ్ చేసుకోవాలి అలా నలుగురు ఒకేసారి లైన్ లోకి వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు.