Begin typing your search above and press return to search.
కొత్త పాలసీపై వెనక్కి తగ్గలేదు.. ప్రభుత్వ ప్రశ్నలకు బదులిస్తామన్న వాట్సాప్
By: Tupaki Desk | 15 Jan 2021 11:30 AM GMTతిరుగులేని మెసేజింగ్ యాప్ గా మార్కెట్లో ఉన్న వాట్సాప్.. తాజాగా తన కొత్త ప్రైవసీ పాలసీని తెర మీదకు తీసుకురావటం.. దానికి అంగీకరించని యూజర్లకు సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించటం తెలిసిందే. దీనిపై మొదలైన రగడ.. వాట్సాప్ తీరును నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ను విడిచిపెట్టి.. సిగ్నల్.. టెలిగ్రామ్ యాప్ ల డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగాయి. అయితే.. ప్రైవసీ విషయంలో తాము వినియోగదారుల నమ్మకం కోసం పోటీ పడాల్సి వస్తుందని తమకు తెలుసని.. అది ప్రపంచానికి చాలా మంచిదని పేర్కొంది వాట్సాప్.
ప్రైవసీని కాపాడటంతో పోటీ ఉండటం మంచిదే అంటూ.. సిగ్నల్.. టెలిగ్రామ్ డౌన్ లోడ్ల పెరుగుదలపై తమకెలాంటి ఆందోళన లేదన్న విషయానని తెలియజేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. ఖాతాదారుల ప్రైవసీ.. భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తమపై వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాట్సాప్.. ఫేస్ బుక్ లు యూజర్ల సంభాషణను చదవలేవని స్పష్టం చేయటంతో పాటు.. చూడలేవని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే.. వాట్సాప్ పే మెంట్స్ కు ప్రత్యేకమైన ప్రైవసీ పాలసీ ఉందని చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ.. వాట్సాప్ పేమెంట్స్ కు వర్తించదన్నారు. అయితే.. తాము తెస్తున్న ప్రైవసీ పాలనీని ప్రభుత్వం ప్రశ్నిస్తే.. దానికి సమాధానాలు ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాట్సాప్ కు తెస్తున్న ప్రైవసీ పాలసీ.. వాట్సాప్ పేమెంట్స్ కు ఎందుకు తీసుకురావటం లేదు? అన్నది ప్రశ్న. గోప్యతా విషయం వినియోగదారుల ఆసక్తులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పే సంస్థ.. తన వాట్సాప్ పేమెంట్స్ కు కొత్త విధానాన్ని అమలు చేయటానికి ఎందుకు ఒప్పుకోవటం లేదన్నది ప్రశ్నగా మారిందని చెప్పాలి.