Begin typing your search above and press return to search.

మరోసారి ఆగిపోయిన వాట్సప్....ఫేస్‌ బుక్ - ఇన్ ‌స్టాగ్రామ్ కూడా..!

By:  Tupaki Desk   |   9 April 2021 6:36 AM GMT
మరోసారి ఆగిపోయిన వాట్సప్....ఫేస్‌ బుక్ - ఇన్ ‌స్టాగ్రామ్ కూడా..!
X
ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతాలున్నాయి. సెకన్ ‌కు ఓసారి వాట్సప్, నిమిషానికోసారి ఫేస్ ‌బుక్ చూసుకోకుండా ఉండలేకపోతున్నారు జనం. కాసేపు ఆ సేవలన్నీ నిలిచిపోతే ఎదో ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతుంటారు. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా మరోసారి జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలతో వాట్సప్, ఫేస్ ‌బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు గంట పాటు వాట్సప్, ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. ఫేస్ ‌బుక్, ఇన్‌ స్టా లు ఓపెన్ కాలేదు. వాట్సప్‌ నుంచి సందేశాలు వెళ్లలేదు. అయితే, ఆ తర్వాత టెక్ టీమ్ రంగంలోకి దిగి సేవలను పునరుద్ధరించింది.

కన్ఫిగరేషన్ చేంజ్ వలన ఫేస్‌ బుక్ సేవలకు అంతరాయం కలిగిందని ఆ సంస్థ తెలిపింది. వెంటనే సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు తెలిపింది. నెల రోజుల వ్యవధిలో ఫేస్ ‌బుక్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండోసారి మార్చి 19న కూడా కాసేపు స్తంభించిపోయింది. తెరపై sorry something went wrong అనే సందేశం కనిపించింది. కొన్ని గంటల తర్వాత మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఫేస్‌ బుక్, ఇన్‌ స్టా గ్రామ్ సర్వీసులు నిలిచిపోవడంతో.. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ట్విటర్‌ లో వెతికారు. సాంకేతిక సమస్య గురించి ట్వీట్స్ చేసి జోకులు పేల్చుతున్నారు. ఇటీవల ఫేస్‌ బుక్ డేటా లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. సీఈవో జుకర్ బర్గ్ సహా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది డేటా లీకయిందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే క్రమంలో ఫేస్‌ బుక్ సేవలకు వరుసగా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఏదో జరుగుతోందని యూజర్లు ఆందోళన పడుతున్నారు.