Begin typing your search above and press return to search.
బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
By: Tupaki Desk | 2 Dec 2019 2:30 PM GMT2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజాభీష్టం తెలుసుకోకుండా.. కమిటీల సూచనలు పట్టించుకోకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించి రైతుల విలువైన భూములు లాగేసి సర్వం అన్ని వ్యవస్థలను అక్కడే పెట్టించారు. అప్పుడు సీఎం కావడంతో ఆయనను ఎదురుచెప్పే సాహసం ప్రజలు, నిరసనకారులు చేయలేదు.. కానీ ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్ష నేతగా మారడంతో నాడు చంద్రబాబు చేసిన పాపాలు నేడు తిరిగి ఆయన మెడకే చుట్టుకున్నాయి.
ఇటీవలే రాజధాని అమరావతిలో పర్యటించిన చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. రైతులు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు కట్టి చెప్పులేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా సోమవారం కర్నూలు పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు మరో ఘోర అవమానం. కర్నూలుకు హైకోర్టు సాధన సమితి ఆగ్రహ జ్వాలలతో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఇలా చంద్రబాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అసంబద్ద పనులపై ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు.
చంద్రబాబుకు జిల్లాల పర్యటనలు చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నాయి. మొన్న అమరావతిలో రాజధాని రైతుల నిరసన.. నేడు హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసిన చంద్రబాబుకు కర్నూలు న్యాయవాదుల జేఏసీ నుంచి అసమ్మతి ఎదురైంది. ఇలా చంద్రబాబు నాడు సీఎం గా చేసిన పాపాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. చేసినవాళ్లకు చేసినంత అని ఆడిపోసుకుంటున్నారు. మరి మున్ముందు బాబుకు ఇంకా ఎన్ని అవమానాలు ఎదురవుతాయో చూడాలి..