Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రుల మీద లోకేష్ కామెంట్‌.. లోకేష్ నీ క్వాలిఫికేష‌న్ ఏంటి?

By:  Tupaki Desk   |   14 April 2022 4:30 PM GMT
వైసీపీ మంత్రుల మీద లోకేష్ కామెంట్‌.. లోకేష్ నీ క్వాలిఫికేష‌న్ ఏంటి?
X
తాజాగా ఏపీలో సీఎం జ‌గ‌న్ 2.0 కేబినెట్ కొలువు దీరింది. దీనిలో పాత మంత్రివ‌ర్గంలోని 11 మంది మంత్రుల‌కు, కొత్త‌గా మ‌రో 14 మంది యువ ఎమ్మెల్యేల‌కు.. జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. వీరిలో కొంద‌రు ఫైర్‌బ్రాండ్లు, మ‌రికొంద‌రు ఆలోచ‌నా ప‌రులు.. ఇంకొంద‌రు.. అధినేత జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రులుగా పేరు తెచ్చుకున్న‌వారు కూడా ఉన్నారు. అయితే..ఈ మంత్రి వ‌ర్గ కూర్పుపై.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఏపీ కేబినెట్‌లో ఉన్న‌వారంతా సీఎం జ‌గ‌న్‌కు భ‌జ‌న చేసిన వారేన‌ని నోరు పారేసుకున్నారు.

``సీఎం జ‌గ‌న్ కేబినెట్ 2.0లో మంత్రులంతా డ‌మ్మీలేన‌ని.. అర్ధ‌మైంది. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు భ‌జ‌న చేసిన వారికే ప‌ద‌వులు ఇచ్చారు. ఇదంతా భ‌జ‌న బృందం. `` అంటూ.. లోకేష్ స‌టైర్లు విసిరారు. ఇక‌, సాధార‌ణంగా.. ఏపీ స‌ర్కారుపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. విద్యుత్ చార్జీలు పెంచ‌న‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌పై భారాన్ని మోపార‌ని ఆరోపించారు. వ‌చ్చే నెల‌లో క‌రెంటు బిల్లులు వ‌చ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తామ‌ని.. లోకేష్ వెల్ల‌డించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల నివాసాల‌ను ముట్ట‌డిస్తామ‌ని అన్నారు.

అయితే.. లోకేష్ చేసిన భ‌జ‌న మంత్రి వ‌ర్గం కామెంట్ల‌పై.. నెటిజ‌న్ల నుంచి ఆస‌క్తిక‌ర రియాక్ష‌న్ వ‌స్తోంది. ``లోకేష్ సార్‌.. మీ తండ్రి హ‌యాంలో మీరు కూడా మంత్రిగా ప‌నిచేశారు. మ‌రి మీరు ఏ క్వాలిఫికేష‌న్‌తో మంత్రి అయ్యారు?`` అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబు గ‌త మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన వారు మాత్రం భ‌జ‌న బృందం కాదా? అని ప్ర‌శ్నించారు. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, పీత‌ల సుజాత‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, ప‌రిటాల సునీత‌, కొల్లు ర‌వీంద్ర వంటివారు .. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేయ‌లేదా? ఇదే అంబేద్క‌ర్‌.. జ‌యంతిని పుర‌స్క‌రించుకుని 2016లో చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి అంబేద్క‌ర్ దుస్తులు తొడిగి.. అమ‌రావ‌తిలో క‌టౌట్లు పెట్ట‌లేదా..

రాత్రికి రాత్రి విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని తొల‌గించ‌లేదా? ఇక‌, అప్ప‌టి మ‌రో మంత్రి జ‌వ‌హ‌ర్‌.. చంద్ర‌బాబును ఇంద్రుడితోనూ.. చంద్రుడితోనూ పోల్చి.. మాట‌ల అల్లిక‌తో.. మైమ‌రిపింప‌జేయ‌లేదా? అంతెందుకు.. ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయులు.. చంద్ర‌బాబును రాముడితోనూ.. ఆయ‌న పాల‌న‌ను రామ‌రాజ్యంతోనూ.. పోల్చ‌లేదా? ఇలా చెప్పుకొంటూ.. మీరేమీ త‌క్కువ‌కాదులే.. చిన్న‌.. బాబూ...! అని స‌టైర్లు వేస్తున్నారు. మ‌రి దీనికి లోకేష్ ఏం చెబుతారో చూడాలి.