Begin typing your search above and press return to search.

వైరల్: మంచులో చిరుత వేటాడితే ఇలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   23 April 2021 11:30 PM GMT
వైరల్: మంచులో చిరుత వేటాడితే ఇలా ఉంటుంది?
X
మామూలుగా మైదానాల్లో అడవుల్లో వేటాడడం అన్ని చిరుతలు చేసేవే. కానీ మంచుతో కప్పబడిన హిమాలయాల్లో వేటాడడం అనేది కష్టమైన.. క్లిష్టమైన పని. అక్కడ జంతుజాలం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ అక్కడ దొరికిన ఓ జింకను వేటాడింది చిరుత.. మంచు కొండపై నుంచి కిందకు పడిపోతున్నా సరే.. పట్టుకున్న వేట విడిచిపెట్టకుండా చివరి వరకు పట్టుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా హిమాలయాల్లో దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న కొండలపై ఓ మంచు చిరుత వేటాడింది. ఈ మంచు చిరుత పులులు పర్వతాలపై అత్యంత ఎత్తుల్లో నివసిస్తుంటాయి. ఎత్తైన పర్వతాల మధ్య వాటి వేట భయానకంగా ఉంటుంది.

తాజాగా అలా ఓ జంతువును చూసి వేటాడిన చిరుతపులి వీడియో వైరల్ అవుతోంది. మంచుకొండపై పరిగెడుతూ దాన్ని పట్టేసుకొని ఆ కొండపైనుంచి కిందకు పడుతున్నా పట్టువీడకుండా అది వేటాడిన తీరు అద్భుతంగా ఉంది. ఆ వీడియో సీన్ ఇప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

ఈ వీడియోను ఇండియన్ వైల్డ్ లైఫ్ అఫీషియల్ పేజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను 86వేల మంది వీక్షించగా.. ప్రజలు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. చిరుత వేటకు మంత్రముగ్ధులయ్యారు.