Begin typing your search above and press return to search.
ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది?
By: Tupaki Desk | 17 April 2023 3:00 PM GMTప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా తుర్కియేకు చెందిన రుమేసా గెల్గీ (26) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఏడు అడుగులకు పైగా ఉన్న ఆమె అత్యంత పొడవైన మహిళగానే కాకుండా మరో నాలుగు ప్రపంచ రికార్డులు కూడా ఆమె పేరుతోనే ఉన్నాయి. పెద్ద చేతులు, పొడవైన వేళ్లు, వెన్నెముక కలిగిన మహిళగానూ ఆమె పేరుతో ప్రపంచ రికార్డులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రుమేసా గెల్గీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? ఆమె ఎందుకు అత్యంత పొడవైన మహిళగా నిలిచింది వంటి వివరాలు మీకోసం... తుర్కియేలోని సఫ్రన్ బోలు జిల్లాలో రుమేసా గెల్గీ జన్మించింది. ఈ క్రమంలో నాలుగు నెలల చిన్నారిగా ఉండగానే ఆమె 'వీవర్స్ సిండ్రోమ్' అనే వ్యాధి బారిన పడింది.
వీవర్స్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన సమస్య. దీనివల్ల ఎముకల్లో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ముఖం, పాదాలు బాగా సాగిపోతాయి. గొంతు కూడా సాగిపోతుంది. మాట బొంగురుగా వినిపిస్తుంది. కండరాలు వదులుగా ఉంటాయి. కండరాల పైనే కాకుండా మెదడుపైనా ఈ వ్యాధి ప్రభావం చూపిస్తుంది.
నెలల వయసులోనే ఈ జన్యుపరమైన వ్యాధి బారినపడ్డ రుమేసా తనకు ఆరేళ్లు వచ్చేసరికే 5.8 అడుగుల ఎత్తు పెరిగింది. కాగా ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారు 50 మంది మాత్రమే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అరుదైన వ్యాధి బారిన పడిన రుమేసా గెల్గీ నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ జీవన పోరాటం తప్పడం లేదు. ఈ అరుదైన వ్యాధి కారణంగా రుమేసా గుండె పనితీరులో లోపం వెలుగుచూసింది. అధిక ఎత్తు ఉండటం వల్ల వెన్నెముక ఒకవైపు వంగిపోయింది. దీంతో నడవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వైద్యులు ఆమెకు కొన్నిచోట్ల రాడ్లు, స్క్రూలు అమర్చారు. ఫలితంగా రుమేసా విద్యాభ్యాసమంతా ఇంటి వద్దే సాగింది.
అందరి పిల్లల్లా స్నేహితులతో ఆడుకోవడానికి వీలవలేదు. అయినా ఆమె మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తన తియ్యని మాటలతో ఎంతోమందికి దగ్గరైంది. రుమేసా ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది కాబట్టి ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఒక వ్యాన్ ను సిద్ధం చేశారు. అందులోనే పడక ఏర్పాట్లు చేశారు. టర్కిష్ ఎయిర్ అనే విమానయాన సంస్థ విమానంలో రుమేసా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 6 సీట్లను ఓ స్ట్రెచర్‌లా మార్చింది.
కాగా జీవితాంతం కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ రుమేసా చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. దీంతో కాలిఫోర్నియాలో వెబ్ డెవలపర్‌గా ఉద్యోగం సాధించింది. ఎప్పటికప్పుడు తన జీవిత విశేషాలను రుమేసా ఇనస్టాగ్రామ్ లో పోస్టు చేస్తుంటుంది. రూపాన్ని బట్టి మనుషులను అంచనా వేసే పద్ధతి మానుకోవాలని కోరుతోంది. దీనిపై అనేక షోలు, ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.