Begin typing your search above and press return to search.

టీడీపీలో జంపింగుల పొలిటిక‌ల్ జీవితం ఏమ‌వుతుందో...!

By:  Tupaki Desk   |   20 Feb 2023 11:00 AM GMT
టీడీపీలో జంపింగుల పొలిటిక‌ల్ జీవితం ఏమ‌వుతుందో...!
X
ఔను.. జంపింగుల పొలిటిక‌ల్ జీవితాల‌కు ఇప్పుడు పెద్ద‌గా లైఫ్ క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం బాగోలేద‌నే అంటున్నారు. ఇక‌, ఇప్పుడు మొత్తం 23 మంది నాయ‌కుల చుట్టూ చ‌ర్చ సాగుతోంది. వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు మ‌రింత ఎక్క‌వ‌ చ‌ర్చ సాగుతోంది.

వారే.. 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫు న విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంత‌కు చేరారు. స‌రే.. వీరిపై రాజ‌కీయ విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌నే అనుకున్నా.. వీరంద‌రికీ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు.

నిజానికి వీరికి ఇవ్వొద్ద‌ని.. ఐదారుగురి విష‌యంలో ఫ‌ర్వాలేద‌ని చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. అయి న‌ప్ప‌టికీ.. చేర్చుకునే క్ర‌మంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆయ‌న వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్ప‌టికే టీడీపీలో ఉండి.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించిన వారికి అన్యాయం జ‌రిగిందనే భావ‌న‌తో వారంతా రెబ‌ల్స్‌గా మారిపోయారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగి.. వీరంతా ఓడిపోయేలా చేశారు.

అయితే.. ఒక్క‌ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో గొట్టిపాటి ర‌వి మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయ‌న‌పైనా వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మార‌మ‌ని సూచించినా.. ఆయ‌న మార‌లేదు. ఇది వేరే సంగతి. క‌ట్ చేస్తే.. మిగిలిన 22 మందిలో అమ‌ర్నాథ్‌రెడ్డి(ప‌ల‌మ‌నేరు), పితాని స‌త్య‌నారాయ‌ణ‌(ఆచంట‌), సుజ‌య్ కృష్ణ రంగారావు(బొబ్బిలి), వంత‌ల రాజేశ్వ‌రి(రంప‌చోడ‌వరం) వంటివారు మాత్రమే అప్పు డ‌ప్పుడు రాజ‌కీయంగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

మ‌రి మిగిలిన వారు ఏమైన‌ట్టు? అంటే.. వీరిలో ఆదినారాయ‌ణ‌(క‌డ‌ప‌) బీజేపీలో చేరారు. మిగిలిన వారు మా త్రం అస‌లు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే దీనికి కార‌ణం వారు బ‌య‌ట‌కు రారు.

వ‌చ్చినా మాట్లాడ‌రు. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరు చేద్దామంటే.. క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికి మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది సందేహంగా మార‌డ‌మే! ఇస్తార‌ని వీళ్లు.. ఇచ్చేది లేదని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.