Begin typing your search above and press return to search.

యువ‌గ‌ళంలో 'సెల్ఫీ కాన్సెప్ట్' రిజ‌ల్టేంటి...?

By:  Tupaki Desk   |   11 Feb 2023 2:03 PM GMT
యువ‌గ‌ళంలో సెల్ఫీ కాన్సెప్ట్ రిజ‌ల్టేంటి...?
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 15 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలోనే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. 15 రోజులు పూర్తి చేసుకోవ‌డం మంచి ప‌రిణామ‌మే. అయితే.. ఈ సంద‌ర్భంగా లోకేష్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు ఏమేర‌కు రియాక్ష‌న్ ఉంది. ఇవి .. పార్టీకి ఎలా దోహ‌ద‌పడుతున్నాయి అనే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో కీల‌కంగా మారిన కార్య‌క్ర‌మం 'సెల్ఫీ'.

నిత్యం పాద‌యాత్ర ప్రారంభానికి ముందు.. ఒక గంట సేపు నారా లోకేష్ 'సెల్ఫీ విత్ లోకేష్‌' కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఉద‌యాన్ని.. త‌న‌ను క‌లుసుకునేందుకు వ‌స్తున్న‌వారితో ఆయ‌న సెల్ఫీ దిగుతున్నా రు. అయితే.. ఇది ఏమేర‌కు పార్టీకి ప్ర‌యోజ‌నం అని చూసుకుంటే.. ఏదో ఫొటోలు దిగుతున్నారు.. వ‌చ్చిన వారిని పంపుతున్నారు.. అంతే ! అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. నిజానికి ఒక్క మాట కూడా ఆ స‌మ‌యంలో మాట్లాడ‌డం లేదు.

ఏదో వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు ఒక ఫొటో తీసుకుని ఆ వెంట‌నే పంపేస్తున్నారు. దీనివ‌ల్ల వారికి జ్ఞాప‌కంగా. . ఒక ఫొటో మిగులుతుంది స‌రే.. కానీ. పార్టీ ప‌రంగా ఏమిగులుతుంది? అనేది కూడా ఇంపార్టెంటు. సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మం కాన్సెప్టు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. రోజుకు వంద‌ల మందితో ఫొటోలు దిగే బ‌దులుగా వ‌చ్చిన వారు ప‌ది మంది అయినా.. కూర్చోబెట్టి.. వారితోనూ చ‌ర్చిస్తే.. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

"వెళ్లాం.. వ‌చ్చాం.. ఏముంది? " అని చాలా మంది సెల్ఫీలు దిగుతుతున్న‌వారు అభిప్రాయ‌ప‌డుతున్నా రు. దీనివ‌ల్ల పార్టీకి ప్ర‌త్యేకంగా ఒన‌గూరే ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. కాబ‌ట్టి.. ఈ కాన్సెప్టును మ‌రింత పెంచాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఒక‌రిద్ద‌రు స్థానికులు చెబుతున్న‌స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే తీసుకుని లోకేష్ ప్ర‌సంగాలు దంచికొడుతున్నారు. అలా కాకుండా.. క‌నీసం 10 మంది అబిప్రాయాల‌ను అయినా .. ఆయ‌న తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌నే సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.