Begin typing your search above and press return to search.
'ఇందిర'ను విధి ముందుగానే హెచ్చరించిందా?
By: Tupaki Desk | 31 Oct 2022 4:30 PM GMTభారత మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ వర్ధంతి నేడు(అక్టోబర్ 31). స్వాతంత్ర్య భారత దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ చరిత్ర సృష్టించారు. 1966 నుంచి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు.. 1980లో నాలుగోవ పర్యాయం ప్రధానమంత్రిగగా ఇందిరా గాంధీ పని చేశారు.
ఇందిరా గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా ఇందిరా పని చేశారు. తన తండ్రి మరణం తర్వాత 1964లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు.
1966లో తొలిసారి ప్రధాని మంత్రి పదవీ చేపట్టిన ఇందిరాగాంధీ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. గరీబ్ హాఠావో నినాదంతో పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. పాలనలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశంలోనే శక్తివంతమైన నాయకురాలిగా ఇందిరా గుర్తింపు తెచ్చుకున్నారు.
1984 అక్టోబర్ 30న భువనేశ్వర్లో ఇందిరా గాంధీ చివరి ప్రసంగించారు. విధి తనను ముందే హెచ్చరించినట్లు ఆరోజు చావుపై మాట్లాడటం గమనార్హం. ఆమె ప్రసంగం ఇలా కొనసాగింది.
‘‘నేను ఈరోజు ఇక్కడున్నాను.. రేపు బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు.. నేను ఉంటానా.. ఉండనా అన్న దానిపై నాకేమీ బాధ లేదు.. నేను సుదీర్ఘ కాలమే జీవించాను.. నేను ప్రజాసేవలో నా జీవితాన్ని గడిపినందుకు గర్వపడుతున్నా.. నేను నా చివరి శ్వాస వరకూ సేవ చేస్తూనే ఉంటాను.. నేను చనిపోతే నా ఒక్కో రక్తం బొట్టూ దేశాన్ని పటిష్టం చేయడానికి తోడ్పడుతుందని." ఉద్వీగ్నంగా మాట్లాడారు.
అంతకు ముందు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యతో సిక్కు మతస్థుల్లో ఇందిరాపై ఆగ్రవేశాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 31 ఉదయం 9గంటలకకు ఆమె సొంత అంగ రక్షకులే ఆమెపై 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి హతమార్చారు. ప్రధాని పదవీలో హత్యగావించబడిన నేతగా కూడా ఇందిరా గాంధీనే నిలిచారు.
ఇదిలా ఉంటే ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఈ విషయంపై ముందుగానే ఆమెను హెచ్చరించారు. సిక్కు భద్రత సిబ్బందిని తన వ్యక్తిగత విభాగంలో నుంచి తప్పించాలని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ను ఆమెకు వద్ద తీసుకెళ్లగా ఆమె ఆగ్రహించారు. ‘‘ఆరింట్ వి సెక్యులర్ (మేము లౌకిక నాయకులం కామా?) అని ప్రశ్నించారు.
చివరికి ఈ నిర్ణయమే ఆ ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏది ఏమైనా దేశం ఓ మహానేతను ఈరోజున కోల్పోవడం చాలా బాధాకరం. ఇందిరాగాంధీ మన మధ్య లేకపోయినా ఆమె ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.