Begin typing your search above and press return to search.

శ్రావణం కోసం ఎందుకు గులాబీ నేతల ఎదురుచూపులు

By:  Tupaki Desk   |   31 July 2020 7:10 AM GMT
శ్రావణం కోసం ఎందుకు గులాబీ నేతల ఎదురుచూపులు
X
ముహూర్తాలను.. వాస్తును ఎక్కువగా నమ్మే టీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్.. ఈ శ్రావణ మాసం మంచి ముహూర్తాల్లో చాలా కార్యక్రమాలు డిజైన్ చేశారు. అటు కొత్త సచివాలయం నిర్మాణ ప్రారంభంతోపాటు నామినేటెడ్ పదవుల పందేరం కూడా చేయబోతున్నారనే వార్తలు టీఆర్ఎస్ వర్గాల్లో జోష్ నింపుతున్నాయి. అందుకే శ్రావణం కోసం టీఆర్ఎస్ నేతలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. వారి లిస్ట్ పెద్దగానే ఉంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కొలువైన మెదక్ జిల్లాలో చాలా మంది ప్రముఖులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ టీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి, పఠాన్ చెరు సపాన్ దేవ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణలు పదవులు ఆశిస్తున్నారు.

ఇక ఇందులో చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవి చింతా ప్రభాకర్ కు ఖాయం అయ్యిందని తెలుస్తోంది. మాజీ మంత్రి సునీతకు కూడా రాష్ట్రస్థాయిలో నామినెటెడ్ పదవి ఖాయమంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఇచ్చిన హామీలు శ్రావణంలో నెరవేరుతాయని వారు గంపెడాశలు పెట్టుకున్నారు.