Begin typing your search above and press return to search.

దాంపత్యంలో ఆనందం కోసం ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
దాంపత్యంలో ఆనందం కోసం ఏం చేయాలి?
X
నేటి ఆధునిక కాలంలో భర్త ఒక చోట భార్య మరో చోట పనిచేస్తూ సుఖ సంసారానికి దూరంగా బతుకుతున్నారు. ఇద్దరు పనిచేస్తే కానీ గడవని నేటి సమాజంలో ఇలా దాంపత్య జీవితానికి దూరంగా కాలం గడుపుతున్నారు.అది వేరే ఇతర వివాహేతర సంబంధాలకు దారితీసి కాపురాలు కూలుతున్నాయి. ఈ తరం దాంపత్యం ఆనందంగా గడపడం అంటే అంత తేలికైన విషయం కాదు.. సర్దుబాటు చేసుకోలేక విడిపోతున్న జంటలు వేలల్లో ఉంటున్నాయి. సమంత-నాగచైతన్య నుంచి సామాన్య జంటల దాకా ఎంతో మంది ఉన్నారు. మరి ఆనందకరమైన దాంపత్యం కోసం ఏం చేయాలన్న దానిపై ఇప్పుడందరూ శూలశోధన చేస్తున్నారు.

చాలా జంటలు దాంపత్య జీవితంలో సుఖంగా లేరని బహిరంగంగానే చెబుతారు. భర్తపై భార్యకు.. భార్యపై భర్తకు కోపతాపాలు ఉన్నాయి. ఎంతో బిజీగా ఉండే నేటి కాలంలో భార్యాభర్తలు తమ సమయాన్ని ఇరువురూ కేటాయించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఒకరినొకరు సమయాన్ని కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత బిజీగా ఉన్నా ఏడాదిలో ఒక సారి కనీసం దంపతులు ఇద్దరూ వెకేషన్ ను ప్లాన్ చేసుకొని ఏదైనా టూర్ వెళ్లి ఆనందంగా గడపాలని సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి పక్కా ప్లాన్ తో వెకేషన్ కు వెళితే అది దాంపత్య జీవితం సాఫీగా సాగించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. బడ్జెట్ ఎక్కువ అవుతుందని విదేశాలు, దూర ప్రాంతాలకు కాకుండా మన దగ్గరలోని ప్రాంతాలకు వెళితే ఆనందం, ఆర్థికంగా భారం కూడా తగ్గుతుందని అంటున్నారు.

ఇక దాంపత్యం విడిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే. జీతాలు సరిపోక.. ఇంట్లో అవసరాలు తీరకనే భార్యభర్తల మధ్య గొడవలు. సరదాలు, సంతోషాలకు డబ్బు లేకనే విడాకులకు దారితీస్తాయి. అందుకే ఆర్థికపరమైన అవగాహన కలిగి ఉండడం జంటలకు అత్యవసరం. వీలైనంత తరచూ ఆర్థికపరమైన అంశాలపై చర్చించుకొని వైవాహిక జీవితాన్ని భారంగా ఖర్చు లేకుండా సాగించడం ముఖ్యం..

ఇక శృంగారం దాంపత్య జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించేలా చేస్తుంది. వీలైనంతగా.. వీలైన చోట ఎక్కువ సార్లు శృంగారాన్ని చేస్తే దంపతుల మధ్య విభేదాలు రాకుండా ఉంటాయి. ఇక కలిసి టీవీ షోలు చూడడం.. వంట చేయడం..కలిసి ఇల్లు క్లీన్ చేయడం లాంటివి చేస్తే కష్టాన్ని ఇద్దరూ పంచుకున్నట్టు అయ్యి అరమరకలు తొలిగిపోయి వారి దాంపత్యజీవితం సాఫీగా సాగుతుంది.