Begin typing your search above and press return to search.
ఏంటి భయ్యా ఇదీ..! ఐపీఎల్లో ప్లాప్..ఇప్పుడేమో దుమ్మురేపుతున్నారు..!
By: Tupaki Desk | 29 Nov 2020 3:50 AM GMTకోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో తేలిపోయారు. పంజాబ్ తరపున ఆడిన మ్యాక్స్‌వెల్, ఆర్సీబీ నుంచి ఆడిన పించ్ ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శన చూపించారు. కానీ వీళ్లు తమ సొంత దేశం తరఫున మాత్రం బాగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇండియా .. ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పించ్ 114 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. వీళ్లిద్దరూ ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదు. దీంతో వీళ్లకు సోషల్‌మీడియాలో పంచ్‌లు వేస్తున్నారు అభిమానులు.ఏంటి భయ్యా ఇదీ..! అప్పుడేమే ఫామ్‌లో లేరు అన్నారు. సొంతదేశం అనగానే దుమ్మురేపుతున్నారు. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 2020లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్కమ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. మొత్తం సీరిస్‌లో ఒక్క సిక్స్ కూడా కట్టలేదు. కానీ ఇటీవల భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించి జట్టు విజయంలో తోడ్పడ్డాడు. ఐపీఎల్ లో తాను సరిగ్గా ఆడనందుకు ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పానని మ్యాక్స్‌వెల్ అనడం గమనార్హం. మరోవైపు ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా వచ్చిన పించ్ ఈ సారి ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు. కానీ భారత్ తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం చెలరేగి పోయాడు. 114 పరుగులు సాధించాడు.
మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన వెస్టిండీస్ ఆటగాడు జిమ్మీ నీషమ్ కూడా శుక్రవారం న్యూజిలాండ్ తరఫున చెలరేగాడు. 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఐపీఎల్‌లో ఫెయిలైన ఆటగాళ్లు జాతీయ జట్ల తరఫున ఇలా చెలరేగిపోవడంపై సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ వస్తున్నాయి. దీంతో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ లో కోట్లు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఆడలేదు. ఇప్పుడు సొంతదేశం తరపున అనగానే పూనకాలు వచ్చాయా? అని ప్రశ్నిస్తున్నారు.