Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటల్ని మాట్లాడే ఇమ్రాన్ ను ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   2 July 2021 6:30 AM GMT
ఇలాంటి మాటల్ని మాట్లాడే ఇమ్రాన్ ను ఏం చేయాలి?
X
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఉదంతాలన్ని కూడా ఆయన ఇమేజ్ ను పెంచేవి కాకుండా డ్యామేజ్ చేసేవే కావటం గమనార్హం. తాజాగా మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా చైనా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

చైనాలోని ఉయ్ గర్ ముస్లింల విషయంలో కమ్యునిస్టు సర్కారు వారిని నిర్బంధ శిబిరాల్లో ఖైదు చేసి.. దారుణ వేధింపులకు పాల్పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చైనా తీరును ప్రపంచ దేశాలు తప్పు పడుతున్నాయి. దారుణ అణచివేతను అమలు చేస్తున్నా.. కిమ్మనకుండా ఉన్న పాక్.. తాజాగా వారి విషయంలో చైనా ప్రభుత్వ తీరును సమర్థిస్తున్నట్లుగా పేర్కొనటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

చైనాలోని ఉయ్ గర్ ముస్లింలపై జరుగుతున్న ఆరాచకాలపై అమెరికా కాంగ్రెస్ కమిషన్ ఒక నివేదికను వెల్లడించింది. వారి విషయంలో చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని కమిషన్ చెప్పినప్పటికీ నోరు మెదపని పాకిస్థాన్.. అందుకు భిన్నంగా చైనావైఖరిని తాము సమర్థిస్తామని పేర్కొంది. అదే సమయంలో తన బుద్ధిని మార్చుకోని ఆయన.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.

కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన ఘోరాతిఘోరంగా జరుగుతోందని.. అయినా మీడియా ఏ మాత్రం పట్టించుకోవటం లేదని.. హాంకాంగ్ పైనే ఫోకస్ చేస్తున్నారంటూ అర్థం లేని వాదనను వినిపించారు. చైనాతో తమకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఉయ్ గర్ ముస్లింల విషయంలో చైనా దృక్పథాన్నే బలపరుస్తున్నామని ఇమ్రాన్ పేర్కొనటం షాకింగ్ గా మారింది. ఆయన మాటలు.. డ్యామేజింగ్ గా మారతాయన్న వాదన వినిపిస్తోంది.