Begin typing your search above and press return to search.
అఫ్గాన్‌లో యుద్ధం..భారత్ లో ఏయే ధరలు పెరుగుతాయంటే ?
By: Tupaki Desk | 17 Aug 2021 8:30 AM GMTఅమెరికా దళాలు వీడిన తరువాత అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేసి వాటిని పక్కాగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. అఫ్గానిస్థాన్ లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని కాబూల్ ను ఆక్రమించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష భవనాన్ని అధీనంలోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్ రాజకీయ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్ నయీమ్ అల్‌జజీరా టీవీతో మాట్లాడుతూ ఈ రోజు అఫ్గాన్ ప్రజలు, ముజాహిద్దీన్ లకు చాలా గొప్పది. వారి 20 ఏళ్ల త్యాగఫలాలు నేడు అందాయి. భగవంతుడికి ధన్యవాదాలు. దేశంలో యుద్ధం ముగిసింది అని పేర్కొన్నారు. దేశ రాజధాని కాబూల్ స్వాధీనానికి వారికి కనీసం వారం రోజులు కూడా పట్టలేదు. అమెరికా వేల కోట్ల డాలర్లు ధారపోసి అఫ్గాన్ సైనికులకు ఇచ్చిన శిక్షణ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. వారు కనీస పోరాటం కూడా చేయకుండా రాజధానిని అప్పజెప్పారు
ఇక ఈ వ్యవహారం ఇలా ఉంటే .. ఆప్ఘనిస్థాన్, భారత్ మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ ఎగుమతుల వాటా 826 మిలియన్ డాలర్లు కాగా.. అఫ్గాన్ వాటా 510 మిలియన్ డాలర్లు ఉంది. ఆప్ఘనిస్థాన్ నుంచి కొన్ని వస్తువుల్ని భారత్ దిగుమతి చేసుకునేది. అవి ,డ్రై ఫ్రూట్స్. కిస్మిస్, వాల్ నట్స్, బాదం, పిస్తా, పైన్ నట్స్, చెర్రీ, పుచ్చకాయలు సహా పలు ఆయుర్వేద మూలికలను ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్ష అక్కడి నుంచి పెద్ద ఎత్తున భారత్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర విపరీతంగా పెరగనుంది.
ఇక మన దేశం నుంచి ఆప్ఘనిస్థాన్ కు తేయాకు, కాఫీ, మిరియాలు, పత్తి వంటివి ఎగుమతి అవుతున్నాయి. ఔషధ నూనె గింజలతో పాటు జీలకర్రను కూడా భారత దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులపై ప్రభావం చూపించనున్న నేపథ్యంలో జీలకర్ర భగ్గున మండనుంది. దీంతో జీలకర్ర ఇంకా పెరగడం ఖాయం. కనుక ముందుగానే కొనుక్కొని దాచుకోవడం మంచిది. తాలిబన్ల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడే అవకాశం ఉంది. దీంతో భారత పై ప్రభావం చూపించనుంది, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే భారత కు అవసరమైన చమురులో 92 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి రేగినా.. అది మన దేశంలోని పెట్రోల్, డీజిల్ పై ప్రభావం చూపిస్తుంది. అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ఇక్కడి ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అఫ్గాన్ పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఉంటుందని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతిదారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.