Begin typing your search above and press return to search.

లాడెన్ హతమయ్యాక పాక్ అధ్యక్షుడి తీరుపై ఆశ్చర్యమేసింది : ఒబామా

By:  Tupaki Desk   |   20 Nov 2020 2:30 AM GMT
లాడెన్ హతమయ్యాక పాక్ అధ్యక్షుడి తీరుపై  ఆశ్చర్యమేసింది : ఒబామా
X
2011 సెప్టెంబర్ లో అమెరికా ట్విన్‌ టవర్స్‌ ని కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అబొట్టాబాద్‌ కాంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి మట్టుబెట్టింది. నాటి సంఘటనలను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గుర్తు చేసుకున్నారు.‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. ఇందులో బిన్‌ లాడెన్‌ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్‌ గురించి ఆయన ప్రస్తావించారు. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని ఒబామా తెలిపారు. పాకిస్తాన్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్‌, అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాక్‌ నుంచి ఎటువంటి మద్దతు తీసుకోలేదని ఒబామా తెలిపారు. లాడెన్ ను మట్టు పెట్టిన ఆపరేషన్‌ గురించి ఒబామా చెప్పిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే

అబొట్టాబాద్‌లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్‌ శివారులో ఉన్న ఓ సురక్షిత ప్రాంతంలో అల్‌ఖైదా చీఫ్‌ లాడెన్‌ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్‌పై దాడి చేయడానికి ఇదే సరైన సమయం అనిపించింది. వెంటనే అందుకే రంగంలోకి దిగాము. దీనిపై ఎటువంటి దాడి చేయాలి అనే అంశంపై
అప్పటి జాతీయ భద్రతా సలహాదారు టామ్‌ డోనిలన్‌, అప్పటి సీఐఏ అధికారి జాన్‌ బ్రెన్నన్‌ లతో చర్చించాం. లాడెన్ పై ఎలాంటి చర్యకు ఉపక్రమించినా దానికి సంబంధించిన విషయం చాలా సీక్రెట్ గా ఉంచాలని అందరూ నిర్ణయించుకున్నాం. లాడెన్ ని చంపడం అంటే అతి పెద్ద ఆపరేషన్. దీని గురించి బయట తెలిసిందంటే సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంది. అలా సమాచారం బయటకు పొక్కిందంటే లాడెన్ ని చంపడానికి వచ్చిన అవకాశాన్ని పోగుట్టుకున్నట్లేనని తెలుసు. అందుకే అతడిని మట్టుబెట్టడానికి పక్కాగా ప్లాన్ చేశాం.

అందుకే కేవలం ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్‌ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. పోనీ పాక్‌ను భాగస్వామిగా తెచ్చుకుందాం అనుకుంటే అది మరింత రిస్క్. ఎందుకంటే పాక్‌ సైనిక, నిఘా వర్గాల్లో ఉన్నతస్థాయి అధికారులకు అల్‌ఖాయిదాతో, లాడెన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.అందువల్లే వైమానిక దాడి జరిపి లాడెన్ ను చంపేయడమా లేకపోతే ఓ ప్రత్యేక కమాండో బృందం హెలికాప్టర్‌ ద్వారా ఆ కాంపౌండ్‌లో దిగి లాడెన్‌ను కాల్చి చంపి సంఘటనా స్థలానికి మాకు పోలీసులు సైనికులు వచ్చేలోగా అక్కడి నుంచి వెళ్లి పోవడం. అనే అంశంపై చర్చలు జరిపాం. చివరికి కమాండో ఆపరేషన్ బెస్ట్ అని పించి దానినే ఎంపిక చేసుకున్నాం.

అయితే నాటి అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్‌, రక్షణమంత్రి రాబర్ట్‌ గేట్స్‌ దీని వల్ల తలెత్తే పర్యవసనాలు ఏవిధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. అప్పటి విదేశాంగ మంత్రి హిల్లరీ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి 51-49 అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ భద్రతా బృందంతో తీవ్రంగా ఆలోచించిన తర్వాత కమాండో ఆపరేషన్ కి రంగం సిద్ధం చేశాం. కమాండోలో అనుకున్నట్టే లాడెన్ ఉంటున్న నివాస ప్రాంతంలోకి హెలికాప్టర్ల ద్వారా దిగి లాడెన్ ని హతమార్చినట్లు' ఒబామా వివరించారు.

'లాడెన్‌ను మట్టు పెట్టిన తర్వాత అన్ని దేశాల అధినేతల కు ఫోన్ చేసాం. అయితే పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీకి ఫోన్ చేస్తే ఆయన నుంచి ఎటువంటి సమాధానం వస్తుందా అని ఆలోచించాం. ఎందుకంటే ఆ దేశ అనుమతి తీసుకోకుండా హెలికాప్టర్లతో ప్రవేశించి అంతర్జాతీయ ఉగ్రవాదిని మట్టు బెట్టడానికి ఏకంగా కమాండో ఆపరేషన్ నిర్వహించాం. దీనిపై పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందో అని అనుకున్నాం.అయితే నేను ఫోన్‌ చేయగానే ఆయన మొదట నాకు కంగ్రాట్స్‌ చెప్పారు. తన భార్య బేనజీర్‌ భుట్టో హత్య వెనుక తాలిబాన్‌, అల్‌ఖాయిదా పనిచేశాయంటూ భావోద్వేగానికి గురయ్యారు' అని ఒబామా తను రాసిన పుస్తకంలో వివరించారు.