Begin typing your search above and press return to search.

నెల్లూరు రెడ్ల దూకుడు : ఉప ఎన్నికలు కన్ ఫర్మ్...?

By:  Tupaki Desk   |   11 Jun 2023 12:16 AM GMT
నెల్లూరు రెడ్ల దూకుడు :  ఉప ఎన్నికలు కన్ ఫర్మ్...?
X
ఏపీ లో ముందస్తు ఎన్నికలు అంటూ ఇప్పటిదాకా అంతా ఊదరగొట్టారు. అయితే సీఎం జగన్ దానికి ఒక్క మాటతో చెక్ పెట్టేశారు. ఇపుడు ఏ ఎన్నికలూ లేవని ఏకంగా షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి తరువాత ఏ సమరం అయినా అని అంతా అనుకుంటున్న నేపధ్యం లో ఉప ఎన్నికలు తోసుకొచ్చేలా సీన్ కనిపిస్తోంది అంటున్నారు.

నెల్లూరు లో ముగ్గురు రెడ్లు యమ దూకుడుగా ఉన్నారు. వారు అలా ఉన్నారని కాదు కానీ పరిస్థితి అలా వారిని ముందుకు నెడుతోంది. లోకేష్ పాదయాత్ర కాస్తా ఇపుడు నెల్లూరు మీదుగా వస్తోంది. దాంతో నెల్లూరు లో 2019లో క్లీన్ స్వీప్ చేసి బలంగా ఉన్న వైసీపీ ఇలాకా లో లోకేష్ పాదయాత్ర హిట్ కావాలంటే ఉన్న బలం చాలదు.

అయితే రెడీ మేడ్ గా కొన్ని నెలల ముందే వైసీపీ తో విభేదించి ముగ్గురు రెడ్లు సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారు వైసీపీ కి యాంటీ గా టీడీపీ కి అనుకూలంగా మాట్లాడగలరేమో కానీ యాక్షన్ లోకి దిగలేరు. చేతులు కలుపి కండువాలు కప్పుకుని పసుపు తమ్ముళ్లతో జట్టు కట్టి తిరగలేదు. అలా కనుక వారు చేస్తే అనర్హత కత్తి వేలాడుతూనే ఉంది.

దాంతో కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఆ తరువాత ఓపెన్ కావాలనుకున్నారు. కానీ ఇపుడు వారికి టీడీపీ లో బెర్తులు కన్ ఫర్మ్ కావాలంటే లోకేష్ పాదయాత్ర కు మద్దతు గా నిలవక తప్పని సీన్. అందుకే చంద్రబాబుని ఆనం రామనారాయణ రెడ్డి కలసి వచ్చారు.

మరో వైపు చూస్తే వచ్చే నెలలో తాను వైసీపీ కి రాజీనామా చేస్తాను అని ఆనం అంటున్నారు ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అయితే ఏకంగా లోకేష్ ని కలసి వచ్చారు. ఆయన లోకేష్ పాదయాత్ర దిగ్విజయం చేయాలని చూస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇంకో వైపు ఉన్నారు ఆయన తో టీడీపీ వారు మంతనాలు జరిపారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో ముగ్గురు రెడ్లూ డైరెక్ట్ గా లోకేష్ పాదయాత్ర లో పాల్గొంటారా. జై కొడతరా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అలా కనుక చేస్తే క్షణాలో వారి ఎమ్మెల్యే సభ్యత్వాలు పోతాయి. ఆ టైం కోసమే వైసీపీ ఎదురు చూస్తోంది. స్పీకర్ ఎటూ వైసీపీ వారే. ఏ మాత్రం ఆధారాలు దొరికి నా మాజీ ఎమ్మెల్యేల ను చేసి పారేస్తారు. ఏపీ లో ప్రస్తుత ప్రభుత్వానికి తొమ్మిది నెలల పై దాటి టైం ఉంది. ఆరు నెలల లోపు కనుక ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే కచ్చితనా ఎన్నికలు పెట్టేందుకు ఎన్నికల సంఘం రూల్స్ ఓకే చెబుతాయి.

అలా కనుక జరిగితే డిసెంబర్ లో తెలంగాణా తో పాటే ఏపీ లో కూడా నెల్లూరు నుంచే మూడు ఉప ఎన్నికలు ఉంటాయి. ఈ టైం లో ఉప ఎన్నికలు కోరుకోవడం అంటే మంచి పరిణామం కాదు. ఎందుకంటే అధికార పార్టీ కే ఆ ఉప ఎన్నికల్లో విజయం దక్కుతుంది కాబట్టి. అన్ని బలాలూ ఉపయోగించి మరీ వైసీపీ సీట్లు గెలుచుకుంటుంది. ఇక అన్ని బలాలూ 2024 ముందే ఖర్చు అయిపోతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి లాంటి వారికి ఎంతో ఇబ్బంది. ఇక ఆనం వారు మళ్లీ వెంకటగిరిలో పోటీ చేయరు.

ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే అది వ్యూహాత్మకంగా తప్పిందం అవుతుంది. ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అటు లోకేష్ పాదయాత్ర, టీడీపీ లో సీట్లు, ఇటు ఎమ్మెల్యే సభ్యత్వాల మీద అనర్హత కత్తి వేలాడుతూ ఉంది. దీంతో నెల్లూరు రెడ్ల దూకుడు ఏపీ లో ఏమి చేయబోతోంది అన్నదే చూడాలని అంటున్నారు.