Begin typing your search above and press return to search.

మీ పిల్లలు మీ మనవళ్లు ఏ మీడియం?

By:  Tupaki Desk   |   11 Nov 2019 9:19 AM GMT
మీ పిల్లలు మీ మనవళ్లు ఏ మీడియం?
X
మనం ఒకరికి చెప్పడం తప్పు కాదు ..కానీ , అవతలి వ్యక్తి మనం చెప్పిన దాని కి తిరిగి ఏమైనా అంటే ఆ ప్రశ్న కి మనం సమాధానం చెప్ప గలగాలి. ఆ స్థాయి లో ఉంటే నే మనం ఎదుటి వారిని ప్రశించవచ్చు. మనం ఒక వైపు అదే తప్పు చేస్తూ ..మళ్ళీ పక్కనున్న వారి దగ్గరి కి వెళ్లి నువ్వు చేసేది తప్పు అంటే ..వారు వింటారా చెప్పండి. నువ్వు చేస్తే సంసారం ..నేను చేస్తే వ్యభిచారం అని అడుగుతారు. కాబట్టి మనం దేని గురించైనా మాట్లాడే ముందు .. ఆ విషయం లో మనల్ని ఎదుటువారు ప్రశించకుండా చూసు కోవాలి. కానీ , ఈ విషయం లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు గారు ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలి. అసలు విరేమన్నారు ..అని అనుకుంటున్నారా ...అక్కడికే వస్తున్నా ..

కొత్త గా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆంధ్రప్రదేశ్‌ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే ..మరి కొందరు విమర్శిస్తున్నారు. తెలుగు భాష ని కాపాడాలి అని ఒకరు , తెలుగు ని నాశనం చేస్తుంటే ..తెలుగు భాష పరి రక్షణా సమితి ఎక్కడా అని కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి లో స్పదించారు.

మౌలానా ఆజాద్‌ జయంతి వేడుక ల్లో పాల్గొన్న సీఎం.. మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివాడు? ఆయన మనవడు ప్రస్తుతం ఏ మీడియం లో చదువుతున్నాడని జగన్ ప్రశించారు. అలాగే మరో వైపు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమర్శల పై స్పందిస్తూ.. మీ మనవళ్లు ఏ మీడియం స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శలకు సమాధానమిచ్చారు సీఎం వైఎస్ జగన్... యాక్టర్ పవన్ కల్యాణ్‌ కు ముగ్గురు భార్యలు, బహుశా నలుగు రో, ఐదుగు రో పిల్లలు అనుకుంటా.. వారంతా ఇప్పుడు ఏ మీడియం స్కూల్‌ లో చదువుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో చదివితేనే పోటీ ప్రపంచం లో గెలవ గలరని స్పష్టం చేశారు. అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నామన్న ఆయన. ఆ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామన్నారు. పేద వాళ్లకు ఇంగ్లీష్‌ మీడియం వద్దంటూ పెద్ద పెద్దవాళ్లు.. చంద్రబాబు, వెంకయ్య నాయుడు లాంటి పెద్దపెద్ద నేతలు.. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు స్పందించిన తీరు బాగా లేదు అని , పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియా స్కూల్ లో చదవడం మీకు ఇష్టం లేదా అని ప్రశించారు.