Begin typing your search above and press return to search.

అదేం మహారాష్ట్ర బాబోయ్.. అన్ని పార్టీలూ, కూటములా!

By:  Tupaki Desk   |   24 Oct 2019 12:54 PM GMT
అదేం మహారాష్ట్ర బాబోయ్.. అన్ని పార్టీలూ, కూటములా!
X
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ విజయోత్సవాలను జరుపుకుంటోంది. అయితే విజయోత్సవాలను జరుపుకునేంత ఘన విజయం ఏమీ కాదది. ఎలాగంటే.. మహారాష్ట్రలో మొత్తం సీట్ల సంఖ్య రెండు వందల ఎనభైఎనిమిది.అందులో బీజేపీకి దక్కింది దాదాపు వంద సీట్లు మాత్రమే! దాదాపు మూడో వంతు సీట్లు మాత్రమే. అయినా కమలం పార్టీ ఎగిరి గంతులు వేస్తూ ఉంది!

బహుముఖ పోటీలో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో నిలిచింది అంతే. అది కూడా శివసేనతో పొత్తు వల్ల ఆ మాత్రం సీట్లు. శివసేన, బీజేపీలు జాయింట్ ఓట్లతో, జాయింటుగా అధికారానికి దగ్గరయ్యాయి. వారిద్దరూ గట్టిగా కలిసుంటే కానీ ప్రభుత్వం నిలబడే అవకాశాలు ఉండవు.

ఇక ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిది మరో కథ. ఆ రెండు పార్టీలూ కలిసి దాదాపు వందకు పైగా సీట్లను సాధించాయి. అయితే మహారాష్ట్రలో సీట్ల పంచాయితీ ఇంతటితో అయిపోలేదు!

ఇతరులు కేటగిరిలోని వారు దాదాపు ముప్పై సీట్ల వరకూ సాధించారు! పదో వంతు సీట్లను చోటామోటా పార్టీలు, ఇండిపెండెంట్ లు, తిరుగుబాటు దార్లు సొంతం చేసుకోవడం గమనార్హం! ఏతావాతా విజయానందంలో ఉన్న బీజేపీ సాధించుకున్న సీట్లతో పోలిస్తే.. ఓడిపోయిన బాధలో ఉన్న వారు పొందిన సీట్లు దాదాపు రెండు రెట్లు ఎక్కువ. బీజేపీకి వంద సీట్లు వస్తే ఇతరులకు రెండు వందల సీట్లు వచ్చాయి.వారిలో శివసేన మాత్రం బీజేపీకి సపోర్ట్.

సీట్ల సంఖ్యలోనే ఇంత గత్తరబిత్తర ఉంటే.. ఓట్ల షేరింగుల లెక్కలు బయటకు వస్తే.. భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు వేసిన ఓట్లు మరి తక్కువ శాతం అవుతాయి కాబోలు!