Begin typing your search above and press return to search.

అయ్యప్ప స్వామితో పెట్టుకుంటే సీన్ సితారే...?

By:  Tupaki Desk   |   28 May 2019 8:49 AM GMT
అయ్యప్ప స్వామితో పెట్టుకుంటే సీన్ సితారే...?
X
సీపీఎం.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా .. ఒకప్పుడు ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉండేది.. ముఖ్యంగా కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురాల్లో ప్రభుత్వాలతో పాటు దేశ వ్యాప్తంగా గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఉండేవి.. యూపీఏ 1 నాటికి కేవలం సీపీఎం, సీపీఐలకు 50కి పైగా ఎంపీ సీట్లు ఉండేవి.. యూపీఏ 2 టైంకి ఆ సంఖ్య 30లోపు పడిపోయింది.. ఇక 2014 ఎన్నికల నాటికైతే మోడీ హవాలో ఆ పార్టీ 8 ఎంపీ సీట్లకే పరిమితమైంది.. ఇప్పుడు తాజా పలితాలు చూస్తే కవలం మూడు ఎంపీలు అది కూడా తమిళనాడులో డిఎంకే పుణ్యమా అని పొత్తులో భాగంగా రెండు సీట్లు.. కంచుకోట కేరళలో ఒక్క సీటు మాత్రమే దక్కాయి..

పశ్చిమబెంగాల్ లో అధికారం కోల్పోయి చాలా సంవత్సరాలైంది.. మోడీ హవా బిజెపి మ్యాజిక్ తో త్రిపురాలోనూ లెప్ట్ కోట కూలిపోయింది.. ఆ పార్టీకి ఆశలను సజీవంగా ఉంచిన రాష్ట్రం కేరళ.. పార్టీ అధికారంలో కూడా ఉంది.. కానీ తాజా ఫలితాల్లో 20ఎంపీ స్థానాలకు గాను ఆ పార్టీకి దక్కింది ఒక్క సీటు.. ఒక్కాగానోక్క సీటు... ప్రధానంగా హిందూ ఓటరు దూరం కావడమే సీపీఎం కు ఘోరమైన ఫలితాలోచ్చాయనేది ఫలితాలు తర్వాత చూస్తే అర్థమవుతోంది.. సీపీఎం కూడా ఈ హిందూ ఓటరు దూరమైపోయాడని అవగతమైందంటున్నారు.. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ లో మహిళల ప్రవేశంపై దేశ వ్యాప్తంగా రాద్దాంతం జరగడం .. సుప్రీం తీర్పు నేపథ్యంలో కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు పరచడానికి అత్యుత్సాహాం చూపింది.. ఇదే కొంప ముంచిందని .. అయ్యప్ప స్వామి విషయంలో సీపీఎం సర్కార్ వైఖరి హిందూ ఓటర్ల తీవ్ర ఆగ్రహానికి కారణమైందని తేలింది.. దీంతో కంచు కోటలో ఆ పార్టీ కి ఒక్క సీటే వచ్చింది...

మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి కేరళను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.. రాహుల్ వాయినాడ్ నుంచి పోటీ చేసి గెలవడంతో పాటు సీపీఎంకు ఇప్పటి వరకు అండగా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.. దీంతో అటూ హిందూ ఓటర్లు, మైనార్టీ ఓటర్లు ఇద్దరూ దూరమైపోయారు.. అయ్యప్ప వివాదంలో సీపీఎం నేత, కేరళ సీఎం పినరాయి విజయన్ అత్యుత్సాహాం చూపారని సీపీఎం పార్టీలోనూ చర్చ మొదలైందంటున్నారు.. దీనిపై విజయన్ ను వివరణ కోరే అవకాశం ఉందంటున్నారు.. అదే సందర్బంలో అయ్యప్ప స్వామి వివాదానికి సంబంధించి కొంచెం తగ్గి వ్యవహరించాలని.. హిందూ, మైనార్టీ వర్గాల మన్ననను తిరిగి పొందాలని సీపీఎం నేతలు భావిస్తున్నారట.. అది సంగతీ మొత్తానికి అయ్యప్ప స్వామి ఆగ్రహానికి సీపీఎం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది..