Begin typing your search above and press return to search.
మాస్క్ పెట్టుకొని జగన్ రెడ్డికి ఏ శిక్ష వేస్తారు .. నారా లోకేష్ !
By: Tupaki Desk | 21 July 2021 11:50 AM GMTకరోనా విజృంభణ సమయంలో పేస్ మాస్క్ ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. ఈ పేస్ మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల చాలామంది పై పోలీసులు కేసు కూడా పెట్టారు. కరోనా విధ్వంసం చేస్తున్న సమయంలో పేస్ మాస్క్ పెట్టుకోకుండా బయటకి వచ్చిన వారి పై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. దీన్ని కార్నర్ చేసి టీడీపీ నేత , మాజీ మంత్రి నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. . దళితులంటే సీఎం జగన్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని టీడీపీ నారా లోకేష్ ప్రశ్నించారు.
మాస్క్ వేసుకోలేదని కిరణ్ కుమార్ అనే దళిత యువకుడిపై వైసీపీ పోలీసులు దాడి చేసి ఏడాదయిందని, ఇంత వరకు ఆ పోలీసులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ గారూ దళితులంటే మీకు ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. తల్లి, తండ్రి, చెల్లెళ్లని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కిరణ్ ను కిరాతకంగా చంపడానికి మనసు ఎలా వచ్చిందని అన్నారు. జగన్ ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కు కూడా లేదా, అని లోకేశ్ ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే... వైసీపీ సెక్షన్ కింద దళిత యువతేజం కిరణ్ కుమార్ ని హత్య చేసిన బులుగు ఖాకీలు, రోజూ మాస్క్ పెట్టుకోని జగన్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారని అన్నారు. ఇప్పటికైనా కిరణ్ ను హత్య చేసిన ఎస్ ఐ, కానిస్టేబుళ్లను తక్షణమే శిక్షించాలని అన్నారు. కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి, జీవనాధారమైన చెట్టంత కొడుకుని కబళించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.