Begin typing your search above and press return to search.
బాబు చేసిన పని జగన్ మెడకు చుట్టుకుంటుందా?
By: Tupaki Desk | 8 Feb 2023 3:00 PM GMTకేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్ చేకల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లలో... కాపులకు 5% కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని జోగయ్య తన పిటిషన్ లో కోరారు.
అయితే హరిరామ జోగయ్య తన పిటిషన్ లో ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషన్ కు నంబరు కేటాయించేందుకు నిరాకరించడంతో జగన్ ను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించడంతో హైకోర్టు జోగయ్య పిటిషన్ కు నంబర్ కేటాయించింది. జోగయ్య పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకు వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఫిబ్రవరి 7న హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ అంశంపై హైకోర్టు ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. తునిలో నిరసనకారులు రైలు దహనానికి కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లను 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
మరోవైపు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం తన చేతుల్లో ఉండదన్నారు. కాపుల రిజర్వేషన్ కేంద్రం చేయాల్సి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపుల రిజర్వేషన్ కు కేంద్రం ఒప్పుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఇదే అంశాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో రిజర్వేషన్లు ఉండవన్నారు. కేంద్రమే నిర్ణయించాల్సి ఉందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించిన పదిశాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని పూర్తిగా కాపులకే కేటాయించడం సరికాదని జగన్ ప్రభుత్వం పేర్కొంది. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాపులకు రిజర్వేషన్ ను ఆపేశారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిడంతో జగన్ ప్రభుత్వం ఇరుకునపడ్డట్టయిందని అంటున్నారు. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ పై జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అందులోనూ ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం ఆ పార్టీ తలరాతను నిర్దేశించే అవకాశం ఉందని అంటున్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గం కాపులు. వీరంతా ఈసారి జనసేన పార్టీ వైపు నడుస్తారని ఇప్పటికే వివిధ అంచనాలు ఉన్న నేపథ్యంలో జగన్ కాపుల రిజర్వేషన్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కోర్టుకు జగన్ ప్రభుత్వం ఏం చెబుతుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.